
తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి పార్టీ స్థాపించిన మొదటి సారే అఖండ విజయం సాధించాడు. ఊహించని విధంగా అత్యధిక సీట్లు సాధించి సత్తాచాటాడు. ఈ క్రమంలోనే ఈయన రాజకీయ భవిష్యత్తు గురించిన అనేక విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఈయన కర్కాటక రాశిలో జన్మించాడు. ఈయన వెండితెరపైనే కాకుండా, రాజకీయాల్లో కూడా తన పేరు మారు మోగేలా చేస్తాడంట.

ప్రజాసేవలో కొత్త అవతారం ఎత్తి, తన పరిపాలనను సజావుగా సాగిస్తారని పేర్కొన్నారు. అంతే కాకుండా రాజకీయనాయకుడిగా విజయ్ జీవితం మరో మలుపు తిరుగుతుంది. కానీ శత్రువు ప్రభావం ఈయనపై చాలా ఎక్కువగా ఉంటుందంట. ఎంత త్వరగా తన రాజకీయ జీవితం మొదలు పెట్టాడో, కొన్ని సార్లు అది కోల్పో యే పరిస్థితులు కూడా రావచ్చు అని ఆయన తెలిపారు.

ముఖ్యంగా ఈయన జాతకంలో రాహువు ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అంతే కాకుండా గురు, శుక్రగ్రహాల అనుకూలత వలన రాజయోగం పట్టినా, రాహు ప్రభావంతో సమస్యలు ఎదుర్కొంటాడంట. అందువలన ఈయన చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే పదవి కూడా కోల్పోయే ప్రమాదం లేకపోలేదు అని జ్యోతిష్యులు పేర్కొన్నారు.

ఇక విజయ్ వివాహం విషయానికి వస్తే, ఇప్పటికే త్రిషను రెండో పెళ్లి చేసుకోబోతున్నాడంటూ ఈ మధ్య సోషల్ మీడియాలో అనేక వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే విజయ్ భార్య సంగీత విడాకులు తీసుకుంటున్నట్లు వార్త నేపథ్యంలో ఈ రూమర్స్ ఎక్కువ అయ్యాయి. కానీ ఆయన జీవితంలో మాత్రం రెండో పెళ్లి యోగం ఏమీ కనిపించడం లేదని, విజయ్ తన జీవితం ప్రజా పరిపాలపైనే దృష్టి పెట్టే ఛాన్స్ ఉన్నట్లు ఆయన తెలియజేయడం జరిగింది.

ముఖ్య గమనిక : ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది)