శుక్ర సంచారం.. ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.. ఆదాయం, ఆస్తులు, ఉద్యోగంలో ఊహించని లాభాలు!

Updated on: Nov 15, 2026 | 8:43 PM

Venus Transit 2026: నవంబర్ 22న శుక్రుడు తులారాశిలోకి ప్రవేశించనున్నాడు. తన సొంత రాశిలో శుక్రుడి సంచారం కారణంగా సింహం, వృశ్చికం, కర్కాటక రాశుల వారికి ఆర్థిక లాభాలు, ఉద్యోగంలో పురోగతి, ఆస్తి సంబంధిత ప్రయోజనాలు కలగవచ్చని జ్యోతిష్య అంచనాలు చెబుతున్నాయి.

1 / 5
Venus Transit 2026: జ్యోతిషశాస్త్రంలో శుక్రుడికి అత్యంత ప్రాధాన్యత ఉంది. శుక్రుడిని రాక్షసుల గురువుగా పరిగణిస్తారు. జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం శుక్రుడు ప్రేమ, సౌందర్యం, విలాసం, సంపద, సుఖసంతోషాలు, భౌతిక సౌకర్యాలకు కారకుడు. అందుకే శుక్రుడి రాశి మార్పు అన్ని రాశుల వారి జీవితాలపై ప్రభావం చూపుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతారు. ప్రస్తుతం శుక్రుడు కన్యారాశిలో సంచరిస్తున్నాడు.

2 / 5

అయితే నవంబర్ 22, 2026న శుక్రుడు తన సొంత రాశి అయిన తులారాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ రాశిలో శుక్రుడు జనవరి 1, 2027 వరకు కొనసాగుతాడు. శుక్రుడు తన స్వక్షేత్రంలో సంచరించడం జ్యోతిష్యపరంగా ప్రత్యేకమైన పరిణామంగా భావిస్తారు. ఈ సమయంలో ప్రేమ, ఆర్థిక వ్యవహారాలు, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ జీవితానికి సంబంధించిన అంశాల్లో మార్పులు చోటుచేసుకోవచ్చని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ముఖ్యంగా మూడు రాశుల వారికి ఈ శుక్ర సంచారం అనుకూల ఫలితాలను అందించనుందని జ్యోతిష్య అంచనాలు సూచిస్తున్నాయి. ఆ అదృష్ట రాశులు ఏవో, వారికి ఎలాంటి ప్రయోజనాలు కలగవచ్చో తెలుసుకుందాం.

3 / 5

సింహ రాశి..
సింహ రాశి వారికి శుక్ర సంచారం అనేక విధాలుగా కలిసిరానుంది. ఈ సమయంలో మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఎప్పటి నుంచో పూర్తికాని పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి అవకాశాలు లభించే సూచనలు ఉన్నాయి. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారికి తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశం వస్తుంది. మీ పనితీరుతో ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. కెరీర్‌లో పురోగతికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడటంతో పాటు ఆదాయాన్ని పెంచుకునే అవకాశాలు లభిస్తాయి.

సింహ రాశి.. సింహ రాశి వారికి శుక్ర సంచారం అనేక విధాలుగా కలిసిరానుంది. ఈ సమయంలో మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఎప్పటి నుంచో పూర్తికాని పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి అవకాశాలు లభించే సూచనలు ఉన్నాయి. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారికి తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశం వస్తుంది. మీ పనితీరుతో ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. కెరీర్‌లో పురోగతికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడటంతో పాటు ఆదాయాన్ని పెంచుకునే అవకాశాలు లభిస్తాయి.

4 / 5

వృశ్చిక రాశి.. వృశ్చిక రాశి వారికి శుక్రుడు పన్నెండవ ఇంట్లో సంచరించనున్నాడు. ఈ ప్రభావంతో ఆర్థికంగా అనుకూల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. ఆదాయాన్ని పెంచుకోవడానికి కొత్త మార్గాలు అన్వేషిస్తారు. విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేయాలనే కోరికలు నెరవేరవచ్చు. వ్యాపార రంగంలో ఉన్నవారికి కొత్త అవకాశాలు లభిస్తాయి. ముఖ్యంగా విదేశీ సంబంధిత వ్యాపారాలు చేసేవారికి అనుకూల ఫలితాలు ఉండవచ్చు. ప్రేమ జీవితంలో అపార్థాలు తొలగి, భాగస్వామితో అనుబంధం బలపడుతుంది. వైవాహిక జీవితంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా సమయం గడుపుతారు.

5 / 5
కర్కాటక రాశి.. కర్కాటక రాశి వారికి శుక్రుడి సంచారం నాలుగవ ఇంట్లో జరగనుంది. దీంతో కుటుంబం, ఆస్తి, సుఖసంతోషాలకు సంబంధించిన విషయాల్లో అనుకూలత ఏర్పడవచ్చు. కొత్త ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేయాలనే ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. తల్లిదండ్రులతో సంబంధాలు మరింత మెరుగుపడతాయి. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి మంచి అవకాశాలు రావచ్చు. ఇప్పటికే ఉద్యోగం చేస్తున్నవారికి కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. ఊహించని ఆర్థిక ప్రయోజనాలు కలగవచ్చు. మొత్తంగా కుటుంబ జీవితం, వృత్తిపరమైన విషయాల్లో సానుకూల మార్పులు కనిపించవచ్చు. (Disclaimer: ఈ కథనం జ్యోతిష్యశాస్త్ర విశ్వాసాలు, సంప్రదాయ అంచనాల ఆధారంగా రూపొందించబడింది. గ్రహ సంచారాల ఫలితాలు వ్యక్తిగత జాతకాన్ని బట్టి మారవచ్చు. వీటిని శాస్త్రీయంగా నిరూపితమైన వాస్తవాలుగా పరిగణించరాదు.)

Loading...
Unable to load recommendations.
Follow Us