
పెయింటింగ్ ఫొటోస్ : చాలా మంది ఇంటిలో పెయింటింగ్ ఫొటోస్ ఉంటాయి. అయితే చాలా మంది ఇవి ఇల్లు అందం , ఆకర్షణ కోసం అనుకుంటారు. కానీ ఇంటిలో పెయింటింగ్ ఫొటోస్ పెట్టుకోవడం వలన వాస్తు ప్రకారం లక్కు కలిసి వస్తుందంట. దీని వలన ఇంటిలో ఆనందకర వాతావరణం నెలకుంటుంది. ఆర్థికంగా కలిసి వస్తుందని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.

నీరు ప్రవహించే సీనరీస్ : నీరు ప్రవహించే సీనరీస్, చిత్ర పటాలు ఇంటిలో పెట్టుకోవడం చాలా మంచిదంట. ఇది వాస్తు దోషాలను తెలిగించి, ఇంటిలో సానుకూల వాతావరణాన్ని ప్రోత్సహిస్తుందంట. అంతే కాకుండా, ఇది కుటుంబ సభ్యుల పురోగతికి దోహదం చేస్తుందని చెబుతున్నారు పండితులు. అయితే ఇవి ఉత్తరం లేదా ఈశాన్య దిశలో ఉండటం చాలా మంచిది.

ఏడు తెల్ల గుర్రాలు : ఏడు పరిగెత్తుతున్న తెల్ల గుర్రాల ఫొటో చాలా మంచిది ఇంటిలో లివింగ్ రూమ్‌లో పెట్టుకుంటారు. ఇది పురోగతిని సూచిస్తుంది. ఇలా పరిగెత్తుతున్నట్లు ఉన్న ఏడు తెల్ల గుర్రాల చిత్రపటాన్ని లివింగ్ రూమ్‌లో దక్షిణ దిశ వైపు పెట్టడం వలన అన్నింటిలో విజయం కలుగుతుందంట.

నెమలి చిత్రం : వైవాహిక జీవితం ఆనందంగా ఉండాలి అంటే ఇంటిలో నెమలి చిత్రం ఉండాలి అని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. ఏ ఇంటిలో అయితే నెమలి చిత్రపటం ఉంటుందో, ఆ ఇంటిలో సుఖ శాంతులు ఉంటాయంట. అంతే కాకుండా, కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు కూడా ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. కానీ ఈ చిత్రపటం ఉత్తరం లేదా ఈశాన్య దిశలో ఉండాలంట.

పర్వతాల చిత్ర పటం : పర్వతాల చిత్ర పటాలు స్థిరత్వాన్ని సూచిస్తాయి. అయితే ఇలాంటి చిత్రపటాలు ఇంటిలో పెట్టుకోవడం వలన ఇంటిలో ఆనందకర వాతావరణం నెలకుంటుంది. అంతే కాకుండా ఆర్థికంగా కూడా కలిసి వస్తుందని చెబుతున్నారు వాస్తు వాస్త్ర నిపుణులు. అయితే దీనిని నైరుతి దిశలో పెట్టుకోవడం చాలా మంచిదంట. అంతే కాకుండా బెడ్ రూమ్, స్టడీ రూమ్‌లో పెట్టుకుంటే కలిసి వస్తుంది.