
వాస్తు శాస్త్రం ప్రకారం నిమ్మకాయకు ప్రత్యేక స్థానం ఉంటుంది. దీనిని పూజల్లో ఉపయోగిస్తుంటారు. అంతే కాకుండా ప్రతి కూల శక్తుల నుంచి కూడా ఇది రక్షణ కల్పిస్తుంది అంటారు. అందుకే చాలా మంది తమ ఇంటి ముందు నాటుకుంటారు. అయితే వాస్తు ప్రకారం ఇంటి ముందు నిమ్మ చెట్టు ఉంటే ఎలాంటి సమస్యలు ఉండవు కానీ సరైన జాగ్రత్తలు తీసుకోవాలంట. అవి ఏవో చూసేద్దాం.

వాస్తు ప్రకారం నిమ్మ చెట్టును ఉత్తరం లేదా తూర్పు దిశలో పెట్టుకోవడం చాలా మంచిది. అయితే ఎప్పుడూ కూడా నిమ్మ చెట్టు ప్రధాన ద్వారానికి ఎదురుగా ఉండకుండా చూసుకోవాలి. ముఖ్యంగా మీ మెయిన్ గేట్‌కు కనీసం మూడు లేదా నాలుగు అడుగుల దూరంలో ఉండేలా చూసుకోవాలి. లేకపోతే ఆర్థికంగా నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

కొందరు తెలియక నిమ్మకాయ చెట్టును దక్షిణ లేదా పడమర , నైరుతి మూలల్లో నాటుకుంటారు. కానీ ఇలాంటి దిశల్లో నాటుకోవడం అస్సలే మంచిది కాదు. దీని వలన ఆర్థికంగా నష్టపోయే ఛాన్స్ ఉంది. ఇది ఇంటిలో కుటుంబ సభ్యుల మధ్య గొడవలకు కారణం అవుతుంది. అందువలన అస్సలే ఈ దిశల్లో నిమ్మ చెట్టు నాటుకోకూడదు అని చెబుతున్నారు పండితులు

అంతే కాకుండా నడిచే రోడ్డుకు మధ్యలో కూడా ఈ నిమ్మ చెట్టును పెట్టకూడదు. దీని వలన కూడా మీరు మీ జీవితంలో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు వాస్తు నిపుణులు. ఇది మీకు అన్ని విధాలుగా కూడా సమస్యలను తీసుకొస్తుంది. అందువలన సరైన దిశలో సరైన చోట నిమ్మ చెట్టు నాటుకోవడం వలన ఎక్కువ లాభాలు ఉన్నాయంట.

నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు మాత్రమే ఇవ్వడం జరిగిందని గమనించుకోవాలి.