
ధనవంతులు అవ్వాలి అని ఎవరికి ఉండదు చెప్పండి. చాలా మంది ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదించాలి అనుకుంటారు. అయితే కొంత మంది సంపాదించడంలో వెనకబడితే, మరికొంత మంది మాత్రం సంపాదించినా దానిని కాపాడుకోవడంలో ఎప్పుడూ ఇబ్బందులు ఎదుర్కుంటూనే ఉంటారు. ముఖ్యంగా ఆర్థికంగా నష్టపోయే వస్తువులను తమ పర్సులో ఉంచుకుంటారు. కాగా, అసలు పర్సులో ఎలాంటి వస్తువులు ఉండకూడదు, ఏవి ఉంటే, ఆర్థికంగా నష్టపోతారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

చాలా మంది చేసే అతి పెద్ద పొరపాటు ఏమిటి అంటే? పాత బిల్లులు, రసీదులను తమ పర్సులో పెట్టుకుంటూ ఉంటారు. అయితే వాస్తు ప్రకారం అస్సలే పాత బిల్లులుల రసీదులను తమ పర్సులో పెట్టుకుంటారు. కానీ ఇలా పెట్టుకోవడం అస్సలే మంచిది కాదంట. ఇది అప్పుల బాధలను పెంచుతుంది అని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. వీటిని పర్సులో పెట్టుకోవడం వలన సంపాదించనది కూడా పోతుందంట.

అదే విధంగా కొంత మందికి డబ్బును పర్సులో కుక్కి కుక్కి పెట్టే అలవాటు కూడా ఉంటుంది. అయితే అలా డబ్బును కుక్కి కుక్కి పెట్టడం కూడా వాస్తు ప్రకారం మంచిది కాదు, ఇది డబ్బు పట్ల గౌరవం నశించేలా చేయడమే కాకుండా లక్ష్మీదేవి అగ్రహానికి గురి అయ్యేలా చేస్తుందంట. అందువలన ఎట్టి పరిస్థితుల్లో పర్సులో డబ్బును కుక్కి కుక్కి పెట్టకూడదు అని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.

అలాగే ఎప్పుడైనా సరే పర్సులో నాణెలు ఒకవైపు, డబ్బులను సర్దుకొని మరొక వైపు పెట్టుకోవాలంట. దీని వలన చేతిలో డబ్బు మిగలడమే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుందంట. ఇక కొంత మంది తమ పర్సులో పూర్వీకులు లేదా గురువులు, దేవతల ఫొటోలు పెట్టుకుంటారు. కానీ వాస్తు ప్రకారం ఇది కూడా మంచిది కాదు అని చెబుతున్నారు పండితులు. ఎప్పుడైనా సరే పర్సులో జీవించిన ఉన్న వారి ఫొటోలు అవి కూడా చాలా శుభ్రంగా ఉన్నవి మాత్రమే పెట్టుకోవాలి. లేనట్లు అయితే స్వస్తిక్ లేదా ఓం చిహ్నం పెట్టుకోవడం కూడా చాలా మంచిదంట.

ఇవే కాకుండా వాస్తు ప్రకారం, ఆర్థికంగా స్థిరత్వం సంపాదించడానికి పర్సులో చతురస్రాకారపు బంగారం లేదా ఇత్తడి ముక్కను పెట్టుకోవడం వలన ఆర్థికంగా కలిసి వస్తుందంట. అలాగే ప్రతి గురువారం దానిని గంగా జలంతో శుభ్రం చేస్తూ ఉండాలి. దీని వలన అప్పుల బాధలు తీరిపోతాయి. చాలా ఆనందంగా ఉంటారు.