
వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంటిలో కొన్ని వస్తువులను తప్పుడు దిశలో ఉంచడం. పరిశుభ్రతను పాటించకపోవడంవంటి వలన ఇంటిలో సానుకూల శక్తి పెరిగి, ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. అందువలన వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంటిలో ఉత్తర దిశ పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. ఉత్తర దిశ అంటే సంపద వృద్ధి చెందే దిశ. అందువలన ఎప్పుడు కూడా ఈ దిశలో విరిగిన వస్తువులు ఉంచకూడదు, అలాగే, చెత్తాచెదారం లేకుండా చూసుకోవాలి. దీని వలన ఇంటిలో సానుకూల శక్తి పెరుగుతుంది.

అదే విధంగా వాస్తు శాస్త్రం ప్రకారం ఎప్పుడూ కూడా తప్పుడు దిశలో కూర్చోవడం, తప్పుడు దిశలో కూర్చోని భోజనం చేయడం మంచిది కాదంట. ఇది అనేక అడ్డంకులను సృష్టిస్తుందంట. ముఖ్యంగా ఇలా తప్పుడు దిశలో కూర్చోవడం వలన పనుల్లో ఆటంకాలు, డబ్బు విషయంలో ఇబ్బందులు ఏర్పడే ఛాన్స్ ఉన్నదని చెబుతున్నారు పండితులు.

అలాగే ఎప్పుడూ కూడా ఇంటి చుట్టూ పచ్చని మొక్కలు నాటుకోవాలని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. ఇంటి ముందు, ఇంటి చుట్టూ పచ్చని చెట్లు నాటుకోవడం వలన ఇవి సానుకూల శక్తిని పెంచడమే కాకుండా, ఆర్థిక వృద్ధిని పెంచి, అనారోగ్య సమస్యలు లేకుండా చేస్తాయంట. ఇవి మీ వృద్ధికి దోహదపడతాయి.

వాస్తు శాస్త్రంలో ప్రధాన ద్వారానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే ఇక్కడి నుంచి శక్తి అనేది ప్రవేశిస్తుంది. అందువలన ఎప్పుడూ కూడా ప్రధాన ద్వారం అందంగా, ఆకర్షణీయంగా ఉండేలా చూసుకోవాలి. లేకపోతే అనేక సమస్యలు ఎదురు అవుతాయి. ముఖ్యంగా ప్రధాన ద్వారం వద్ద చెప్పులు ఉండకూడదు, అలాగే అక్కడ చెత్తా చెదారం లేకుండా చూసుకోవాలి. అప్పుడే ఇంటిలోకి లక్కు కలిసి వస్తుంది.

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది)