
రాత్రి పగలు రక్తాన్ని చెమటగా మార్చి ఎంత కష్టపడి సంపాదించినా, నెల తిరిగేసరికి చేతిలో పది రూపాయలు కూడా మిగలడం లేదని చాలా మంది బాధపడుతుంటారు. అప్పుల బాధలు, ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు, ఊహించని హాస్పిటల్ ఖర్చులు చుట్టుముడుతున్నప్పుడు దేవుణ్ణి నిందిస్తుంటారు. కానీ శాస్త్రాల ప్రకారం, తప్పు దేవుడిది కాదు.. మన అజ్ఞానంతో ఇంట్లో చేసే చిన్న చిన్న పొరపాట్లదే.

ముఖ్యంగా మన సంపాదనకు, దాచుకునే ధనానికి గుండెకాయ లాంటి బీరువా విషయంలో చేసే భయంకరమైన తప్పుల వల్లే లక్ష్మీదేవి మన ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. బీరువా అనేది కేవలం ఇనుప పెట్టె కాదు.. అది సాక్షాత్తు కుబేర స్థానం, మహాలక్ష్మి కొలువై ఉండే స్వర్ణ పీఠం. బ్రహ్మవైవర్త పురాణంలో సాక్షాత్తు శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవితో "ఎక్కడైతే పరిశుభ్రత ఉండదో, ధనాన్ని అగౌరవపరుస్తారో, అక్కడ నువ్వు నిలబడకూడదు" అని చెప్తాడు.

మనం చేసే మొదటి తప్పు.. మనలో చాలా మంది బయట నుంచి రాగానే చెమట బట్టలతో, కనీసం కాళ్లు చేతులు కడుక్కోకుండా బీరువాను ముట్టుకుంటారు. అలాగే బీరువా లోపల బట్టలను మడతపెట్టకుండా కుప్పలు కుప్పలుగా పడేస్తుంటారు. ఆ బట్టల కిందే జీవితకాల సంపాదన, బంగారం, ఆస్తి పత్రాలను పెడుతుంటారు. ఇలాంటి అపరిశుభ్రమైన వాతావరణం ఉంటే అక్కడ లక్ష్మీదేవి క్షణకాలం కూడా నిలవదు. ఆ స్థానంలోకి దరిద్ర లక్ష్మి అయిన జేష్టాదేవి ప్రవేశిస్తుంది. ఫలితంగా ఇంట్లో నిరంతరం ధన నష్టం, కలహాలు వస్తాయి.

రెండొవ తప్పు బీరువాను ఎల్లప్పుడూ ఇంటికి నైరుతి (South-West) మూలలో తూర్పు లేదా ఉత్తర దిక్కుకు అభిముఖంగా ఉండేలా అమర్చుకోవాలి. ఎందుకంటే ఉత్తర దిక్కు కుబేరుడి స్థానం. బీరువా తెరిచినప్పుడు అది ఉత్తరం వైపు చూస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. బీరువా లోపల కేవలం డబ్బు, నగలు మాత్రమే కాకుండా.. ఒక ఎర్రటి లేదా పసుపు రంగు పట్టు వస్త్రం పరిచి, దానిపై ధనాన్ని ఉంచాలి. డబ్బును ముట్టుకునేటప్పుడు అత్యంత గౌరవంతో, శుచిగా ఉన్నప్పుడు మాత్రమే ముట్టుకోవాలి. బీరువాపై ఎలాంటి పాత వస్తువులు, పగిలిన సామాన్లు లేదా దుమ్ము పేరుకుపోనివ్వకూడదు.

మూడోవ తప్పు ముఖ్యమైన పరిహారం ఏమిటంటే, బీరువాలో ధనం దాచే అరలో ఎల్లప్పుడూ మంచి సుగంధం వచ్చేలా చూసుకోవాలి. అందుకోసం కొద్దిగా పచ్చకర్పూరం, లవంగాలు లేదా ఏలకులను ఒక చిన్న గిన్నెలో ఉంచవచ్చు. ఈ సుగంధ వాసన మెదడుకు తగిలినప్పుడు ఇంట్లో తెలియని పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. లక్ష్మీదేవికి సుగంధాలు అంటే ఎంతో ఇష్టం కాబట్టి, ఆ వాసనకు ఆకర్షితురాలై మీ ఇంట స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. మన ఋషులు, పూర్వీకులు ఆచరించి సిరిసంపదలు పొందిన ఈ చిన్న చిన్న ధర్మ సూక్ష్మాలను పాటించడం ద్వారా అప్పుల బాధలు తొలగి, మీ ఇంట లక్ష్మీదేవి సిరుల వర్షం కురిపిస్తుంది.