
ప్రతి ఒక్కరూ ఇంటిని చీపురుతో శుభ్రం చేస్తుంటారు. అయితే ఇది రోజు వారి పని అనుకుంటారు. కానీ ఇది ఇంటి శ్రేయస్సుకు కూడా ముడి పడి ఉంటుందని చెబుతున్నారు పండితులు. అందుకే ఎప్పుడూ కూడా చీపురు విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలంట. ముఖ్యంగా కొంత మంది చీపురును నిలబెడుతుంటారు. కానీ అలా నిలబెట్టడం అస్సలే మంచిది కాదు అంటారు. కాగా, దాని వెనకున్న జానపద సంప్రదాయాలు, వాస్తు నమ్మకాలు ఏవో ఇప్పుడు చూసేద్దాం.

ఎవరి ఇంటిలో అయితే చీపురు నిలబెట్టి ఉంటుందోవారి ఇంటిలో పేదరికం, ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయంట. దీని వలన ఇంట్లో శాంతి , సంతోషాలన్నీ పోయి, నిత్యం గొడవలు వంటి సమస్యలు తలెత్తుతాయంట. అలాగే ఇంట్లో చీపురును నిలబెట్టడం అంటే లక్ష్మీదేవిని అగౌరవ పరచడం అందుకే ఎప్పుడూ కూడా చీపురును నిలబెట్టి పెట్టకూడదంట.

ఎవరి ఇంటిలో అయితే చీపురు నిలబెట్టి ఉంటుందో, వారి ఇంటిలో ప్రతికూలశక్తి పెరుగుతుందంట. అందుకే ఎప్పుడూ కూడా చీపురు నేలపై సరిగ్గా ఉంచాలి. ముఖ్యంగా చీపురును నిలబెట్టి పెట్టడం వలన అది ఇంట్లో అనేక సమస్యలకు కారణం అవుతుందంట. డబ్బు నిలవకపోవడం, ఇంట్లో ఉన్నవారికి అనారోగ్య సమస్యలు ఎదురు అవ్వడం వంటిది జరుగుతుందంట. అందువలన ఎప్పుడూ కూడా ఇంటిలో చీపురును నిలబెట్టాలి.

ఇక శాస్త్రాల ప్రకారం, పరిశుభ్రత ఉన్న చోటనే లక్ష్మీదేవి కొలువై ఉంటుందని అంటారు. అందులన మరిగి చీపురు ఇంట్లో పేదరికాన్ని తీసుకొస్తుంది. అందువలన చీపురు విషయంలో తప్పకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలంట. ముఖ్యంగా ఎప్పుడూ చీపురును తొక్కకూడదు, సూర్యాస్తమయం తర్వాత చీపురును శుభ్రపరచకూడదు. ఎప్పుడూ కూడా దానిని కంటికి కనిపించకుండా ఉండనివ్వాలి.

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు