
జ్యోతిష్య శాస్త్రంలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అయితే చాలా మంది వాస్తు ఇంటి నిర్మాణం, వంట గద దిశ, వంటి వాటికి మాత్రమే వాస్తు వర్తిస్తుంది అనుకుంటారు. కానీ ఇంటిలో పెంచుకునే మొక్కలపై కూడా వాస్తు ప్రభావం ఉంటుందంట. అయితే చాలా మంది తమ ఇంటిలో కలబంద మొక్కను పెంచుకుంటారు. అయితే ఈ కలబంద మొక్క ఇంటిలో పుష్పించడం శుభమా? అశుభమా? అనే డౌట్ చాలా మందిలో ఉంటుంది. మరి దాని గురించి వాస్తు శాస్త్ర నిపుణులు ఏం చెబుతున్నారంటే?

కలబంద ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా ఇది శరీరంలో వేడి తగ్గించడం, జుట్టు, చర్మ ఆరోగ్యానికి కూడా అనేక విధాలుగా మేలు చేస్తుంది. అయితే ఇంటిలో ఉన్న ఈ కలబంద మొక్క వికసించడం చాలా శుభ ప్రదం అని చెబుతున్నారు పండితులు. ఎవరి ఇంటిలో అయితే ఈ మొక్క పుష్పిస్తుందో, వారికి శుభ ఫలితాలు కలుగుతాయంట.

ఎవరి ఇంటిలో అయితే కలబంద మొక్క పూస్తుందో వారికి మంచి రోజులు రాబోతున్నాయని అర్థం అంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. కలబంద పువ్వును, సంతోషం, సంపదతో ముడిపెడతారు. అందువలన ఇంటిలో కలబంద మొక్క పుష్పించడం చాలా మంచిదంట. ఇది అనేక శుభ ఫలితాలను ఇస్తుంది. అంతే కాకుండా ఇంటిలో సుఖసంతోషాలకు కూడా కారణం అవుతుందని చెబుతున్నారు పండితులు.

అందుకే ఇంటిలోపల కలబంద మొక్క పుష్పించడం చాలా మంచిది. చాలా వరకు ఈ మొక్క కొన్ని సంవత్సరాల వయసు వచ్చినప్పుడు మాత్రమే వికసిస్తుంది. కలబంద పువ్వు నారింజ రంగులో ఉంటుంది. ఇది డబ్బును ఆకర్షిస్తుందంట. అందువలన ఇది వికసించడం వలన ఎవరు అయితే అప్పుల బాధలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో, వారి ఆర్థిక సమస్యలన్నీ తొలిగిపోయి, ఇంటిలోపల ఆర్థిక స్థిరత్వం వస్తుందంట.

అంతే కాకుండా కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ పెరగడం, ఇంటిలో ఆనందం నెలకొనడం, సానుకూలత పెంపొందం జరుగుతుందంట. అందువలన చాలా వరకు ఇంటిలో కలబంద మొక్క పుష్పించడం చాలా మంచిదని చెబుతున్నారు పండితులు. నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు