
సపోటా చెట్టు ఇంటి ముందు ఉండటం అస్సలే మంచిది కాదు అని చెబుతున్నారు పండితులు. ఇది చాలా వరకు అశుభం. అందువలన అస్సలే ఇంటి ముందు ఈ మొక్కను ఉండనివ్వకూడదంట. ఈ చెట్టు ఇంటి ముందు ఉండటం వలన ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు ఎదురయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉందని నిపుణులు తెలియజేస్తున్నారు.

ముఖ్యంగా ప్రధాన ద్వారం ఇంటికి ఎదురుగా ఉండటం వలన అనే ఇబ్బందులు తలెత్తుతాయంట. ఈ చెట్టు ఇంటి ముందు ఉండటం వలన ఇంటి పెద్దకు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అంతే కాకుండా ఇది సానుకూల శక్తికి అడ్డుకుంటుంది. దీని వలన అనేక అడ్డంకులు ఎదురు అవుతాయంట.

అంతే కాకుండా చెట్టు ఇంటి ముందు ఉండటమే కాకుండా, చెట్ల నీడ ఇంటి మీద పడటం కూడా అశుభకరమే అంటున్నారు పండితులు. చెట్ల నీడ ఉదయం లేదా మధ్యాహ్నం సమయంలో ఇంటి మీద పడటం అనేక సమస్యలకు కారణం అవుతుందంట. అలాంటి నివాస గృహాల్లో పురోగతి ఉండదని వారు తెలియజేస్తున్నారు. అందువలన ఏ చెట్టు నీడ కూడా ఇంటి మీద పడకూడదంట.

ముఖ్యంగా చాలా మంది ఇంటి ముందు పండ్ల చెట్లను నాటుకుంటారు. అయితే వీటిని సరైన దిశలో పెట్టడం అవసరం అని చెబుతున్నారు పండితులు. సరైన దిశలో చెట్లు లేకపోతే అది ప్రతి కూల శక్తులకు కారణం అవుతుంది. ఆర్థికంగా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందంట. అందువలన ఎప్పుడూ కూడా ఇంటికి పడమర లేదా దక్షిణం వైపు మాత్రమే నాటుకోవాలి. ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా ఈ మొక్క ఉండకుండా చూసుకోవాలి.

ముఖ్య గమనిక: ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు