
మనీ ప్లాంట్ : మనీ ప్లాంట్ మొక్క, దీనిని సంపద మొక్క అని కూడా అంటారు. ఈ మధ్యకాలంలో చాలా మంది ఈ మొక్కను తమ ఇంటిలో పెంచుకుంటున్నారు. అయితే కొంత మంది ఇది కేవలం ఇంటి అలంకరణకు ఉపయోగపడే మొక్క అనుకుంటారు. కానీ మనీ ప్లాంట్ మొక్కను పెంచుకోవడం వలన సంపద పెరుగుతుంది. ఆర్థికంగా కూడా కలిసి వస్తుంది. వాస్తు దోషాలు కూడా తొలిగిపోతాయి.

తులసి మొక్క : తులసి మొక్క అనేది ప్రతి ఒక్కరి ఇంటిలో అయితే ఉంటుంది. కొంత మంది దీనిని పెంచుకోరు. కానీ తప్పకుండా ప్రతి ఒక్కరి ఇంటిలో ఈ మొక్క ఉండాలి. హిందూ మతంలో దీనికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ఆయుర్వేదపరంగా కూడా చాలా ప్రయోజనకరం. అయితే ఈ మొక్క ఇంటి వద్ద ఉండటం వలన ప్రతి కూల శక్తులను తరిమి కొట్టడమే కాకుండా వాస్తు దోషాలను కూడా లేకుండా చేస్తుందంట.

స్పైడర్ ప్లాంట్ : స్పైడర్ ప్లాంట్ మొక్క ఇంటిలో ఉండటం వలన ఇది ప్రతికూలతను తొలిగించి, ఇంటిలో సానుకూల శక్తిని పెంపొందిస్తుంది. అందువలన దీనిని ఇంటిలో పెంచుకోవడం చాలా మంచిది. వాస్తు ప్రకారం ఎవరి ఇంటిలో అయితే స్పైడర్ ప్లాంట్ మొక్క ఉంటుందో, వారికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఇంకి కూడా అందం ఇస్తుంది

స్నేక్ ప్లాంట్ : ప్రతి ఒక్కరి ఇంటిలో ఖచ్చితంగా ఉండాల్సిన మొక్కల్లో స్నేక్ ప్లాంట్ కూడా ఒకటి. ఇది స్వచ్ఛమైన గాలిని అందిస్తుంది. అంతే కాకుండా వాస్తు పరంగా కూడా కలిసి వస్తుందంట. అందువలన స్నేక్ ప్లాంట్ మొక్కను ఇంటిలో పెట్టుకోవడం చాలా మంచిది. మరీ ముఖ్యంగా లివింగ్ రూమ్ లేదా, బెడ్ రూమ్‌లో పెట్టుకోవడం వలన గాలి శుద్ధి అవ్వడమే కాకుండా ఆరోగ్యపరంగా, వాస్తు పరంగా కలిసి వస్తుంది.

మాన్ స్టెరాన్ : మాన్ స్టెరాన్ మొక్క ఇంటిలో ఉండటం చాలా శుభప్రదం. ఇది వాస్తు ప్రకారం ప్రతికూలతలను తొలిగించి వాస్తు నుంచి మిమ్మల్ని కాపాడుతుంది. అందువలన తప్పకుండా ఈ మొక్క ఇంటిలో ఉండాలి అంటారు. నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదని పాఠకులు గమనించాలి.