
లక్కీ బంబూ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇది నీటిలో, మట్టిలో ఎందులోనైనా సరే చాలా సులభంగా పెరుగుతుంది. అయితే కొంత మంది మాత్రమే ఈ మొక్కను తమ ఇంటిలో పెంచుకుంటారు. కానీ ఇది ఇంటిలో ఉండటం చాలా శుభప్రదం అంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. ముఖ్యంగా ఇది ఇంటిలో ఉండటం వలన అన్నివిధాలుగా శుభఫలితాలు కలుగుతాయంట.

లక్కీ వెదురు మొక్క నీటిలో పెంచున్నట్లు అయితే కుండీలో రంగు రంగుల నీటిని వేసి పెట్టుకోవడం చాలా మంచిది. ఇది ఇంటిలో ఎంత వేపుగా, పచ్చగా, ఆరోగ్యంగా పెరిగితే ఆ ఇంటిలో వాతావరణం అలా ఉంటుంది. మొక్క ఎదిగే కొద్ది సంపద కూడా పెరుగుతుంది. అంతే కాకుండా ఇంటిలో ఆనందం, శ్రేయస్సు నెలకొంటుందంట. అందుకే తప్పకుండా లక్కీ వెదరు మొక్కను ఇంటిలో నాటుకోవాలి అంటారు.

చాలా వరకు వెదురు మొక్కకు ఎరువు అంతగా అవసరం లేదు. చాలా వరకు ఈ మొక్కను చాలా మంది తమ ఇంటిలో, ఆఫీసులో పెంచుకుంటారు. కానీ ఎరువులు ఎక్కువగా వేయరు. ఒక వేళ మొక్క ఎదగడం లేదు అనుకున్నప్పుడు, నెలకు ఒకసారి, కొద్దిగా ద్రవ ఎరువు వేస్తే సరిపోతుంది. దీని వలన ఆకులు పసుపు, ఎరుపు రంగులోకి మారకుండా ఉంటాయి.

మొక్క పెరుగుదలపైనే మీ అదృష్టం ఆధారపడి ఉంటుంది. కాబట్టి దాని పెరుగుదల విషయంలో జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. మొక్క అందంగా పెరగాలి అన్నా లేదా ఆరోగ్యంగా ఉండాలి అంటే కత్తిరింపులు అనేవి తప్పనిసరి. ప్రతి సారి మీరు మొక్కను కత్తిరించడం వలన దానికి కొత్త వేర్లు పెరుగుతాయి. వేపుగా, ఆరోగ్యంగా మొక్క పెరుగుతుంది.

ఇక దీనిని ఇంటిలో కానీ ఆఫీసులో కానీ మీకు నచ్చిన ప్రదేశంలో కాకుండా, ఇంటి తూర్పు దిశలో పెట్టడం చాలా మంచిది. దీని వలన కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. అంతే కాకుండా ఆరోగ్య పరంగా, ఆర్థికంగా అన్నివిధాలుగా ఇది మీకు శుభఫలితాలను ఇస్తుందని చెబుతున్నారు పండితులు.