
చేతిలో అనేక రకాల గీతలు ఉంటాయి. అయితే అందులో కొన్ని ప్రత్యేకమైన గుర్తులు కూడా ఉంటాయి. అయితే అందులో ఎక్కువగా ఇంగ్లీష్ లెటర్స్ కనిపిస్తుంటాయి. అందులో ముఖ్యంగా ఎవరి చేతిలోనైతే M అక్షరం ఉంటుందో వారికి అదృష్టం కలిసి వస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఎవరి చేతిలో అయితే ఎమ్ అనే అక్షరం ఉంటుందో వారికి డబ్బుకు లోటు ఉండదంట. వీరు చాలా చిన్నవయసులోనే కోటీశ్వరులు అవుతారని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

హస్త సాముద్రిక శాస్త్రం ప్రకారం ఎవరి చేతిలోనైతే ఆడవారికి ఎడమ, పురుషులకు కుడి వైపున పుట్టకతోనే ఎమ్ అనే అక్షరం ఉంటే, వారికి అదృష్టం. ఇది అద్భుతమైన లాభాలను తీసుకొచ్చి పెడుతుంది. ముఖ్యంగా ఎవరికి అయితే ఇలా చేతిలో ఎమ్ అనే అక్షరం ఉంటుందో వారు చాలా అదృష్టవంతులు. అన్ని రంగాల్లో మంచి నైపుణ్యం కలిగినవారై ఉంటారు. అన్ని విధాలుగా కలిసివస్తుంది. ఇలాంటి వారిలో నాయకత్వ లక్షణాలు కూడా ఎక్కువగా ఉంటాయి.

అయితే చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. అసలు అరచేతిలో ఈ గుర్తు ఎక్కడ ఉంటుందని? ఎవరికైనా సరే అరచేతిలో జీవన రేఖ, మెదడు రేఖ, హృదయ రేఖల వద్ద ఈ ఎమ్ అనేక్షరం కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ మూడు రేఖలు ఒకదానితో ఒకటి కలిసినప్పుడు మాత్రమే ఈ అక్షరం కనిపిస్తుంది. ఇది ఎవరి చేతిలో ఉన్నా వారు చాలా లక్కీ పర్సన్స్.

ఇలా చేతిలో ఎమ్ రేఖ ఉన్నవారు రాజకీయంగా రాణిస్తారు. అంతే కాకుండా వ్యాపారం పరంగా కూడా వీరికి పోటీ ఎవరూ ఉండరు. ఈ అక్షరం చేతిలో ఉన్న వారు చాలా తెలివైన వారు, మంచి విద్య, మంచి తెలివిని కలిగి ఉంటారు. ముందు చూపు చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా వీరు డబ్బు విషయంలో చాలా ముందు చూపుతో వ్యవహరిస్తారు. డబ్బులు ఖర్చు పెట్టడానికి ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు. వీరికి అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఎంత పేదవాడైనా సరే ఒక్కసారిగా ధనవంతుడు అవుతాడు. అలాగే వీరికి ఆర్థికంగా కూడా చాలా అద్భుతంగా కలిసి వస్తుంది.

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు