న్యూ ఇయర్ రోజు ఇలా చేస్తే.. ఏడాదంత ఇంటినిండా డబ్బే డబ్బు!

Updated on: Jan 01, 2026 | 11:44 AM

నూతన సంవత్సరం వచ్చేసింది. అయితే ఈ సంవత్సరం ఏడాది పొడవునా, మీ ఇంటిలో సంపద, ఆనందం, శ్రేయస్సు నెలకొనాలి అంటే తప్పకుండా కొన్ని వాస్తు నియమాలు పాటించాలని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. కాగా, ఈరోజు ఎలాంటి వాస్తు నియమాలు పాటించడం వలన కొత్త సంవత్సరంలో లక్కు కలిసి వస్తుందో ఇప్పుడు చూద్దాం.

1 / 5
కొత్త సంవత్సరంలో కొన్ని వస్తువులు ఇంటిలో పెట్టుకోవడం వలన అదృష్టం కలిసి వస్తుందంట. కాగా, న్యూ ఇయర్ రోజు చేయాల్సిన పనులు ఏంటి? ఈ రోజు ఇంటిలోకి ఏ వస్తువులు తెచ్చుకోవడం వలన లక్కు కలిసి వస్తుందో చూద్దాం.

2 / 5
న్యూ ఇయర్ రోజున చిన్న కుండను తీసుకొని, అందులో నాణేలు, రత్నాలు, చిన్న పాటి బంగారు వస్తువులు వేసి దానిని మీ ఇంటిలో ఆగ్నేయం లేదా ఈశాన్యం మూలలో పెట్టుకోవడం వలన సంపద పెరుగుతుందని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. అదే విధంగా ఆ మూలకు ఎప్పుడూ మంచి వెలుతురు ఉండేలా చూసుకోవాలి. చీకటి ఉంటే, అది డబ్బు ప్రవాహానికి ఆటంకం కలిగిస్తుందంట.

3 / 5
అలాగే న్యూ ఇయర్ రోజు పచ్చని మొక్కలు ఇంటిలో నాటుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా తులసి, మనీ ప్లాంట్ వంటి ఆకుపచ్చ మొక్కలు ఇంటిలో నాటుకోవడం వలన ఇంటిలో సానుకూల శక్తి పెరిగి, ఇది ఇంటిలో ఆనందానికి కారణం అవుతుందంట. అలాగే, మీకు ఏడాది పొడవు చాలా అద్భుతంగా ఉంటుందంట.

4 / 5
అదే విధంగా న్యూ ఇయర్ రోజున లక్ష్మీదేవి చిత్ర పటం లేదా చిన్న విగ్రహాన్ని ఇంటిలోకి తెచ్చుకోవడం వలన ఇది సంపద, ఆనంద, శ్రేయస్సుకు కారణం అవుతుందంట. న్యూ ఇయర్ రోజున అమ్మవారి ఫొటోను, ఈశాన్యం లేదా ఆగ్నేయ మూలలో ఉంచడం వలన సంపద పెరుగుతుందని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.

5 / 5
కొత్త సంవత్సరం రోజున  మీ ఇంటి ఈశాన్యం మూలలో చిన్న నీటి ఫౌంటెన్ లేదా నీటికి సంబంధించిన వస్తువులను పెట్టుకోవడం మంచిదని చెబుతున్నారు పండితులు. ఈరోజు నీటికి సంబంధించిన వస్తువులు ఈశాన్యంలో పెట్టడం వలన సంపద పెరుగుతుందంట.