
చాల్డియన్ సంఖ్యాశాస్త్రం ప్రకారం, టీ అక్షరంతో ప్రాంభమయ్యే వారి మంచి లక్షణాలు కలిగి ఉంటారంట. వీరి 4వ సంఖ్యకు అధిపతి రాహువు, దీనిని నీడ గ్రహం అని కూడా అంటారు. ఇది ఊహాత్మకమైన ప్రపంచాన్ని సృష్టిస్తోంది. అయినప్పటికీ ఇది మీ కెరీర్‌ను మలుపు తిప్పుతుందంట.

టీ అనే అక్షరంతో ఎవరి పేరు అయితే ప్రారంభం అవుతుందో వారిపై రాహవు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. రాహువు అనుకూలమైన చూపు ఉండటం వలన వీరు చాలా ధైర్యవంతులుగా ఉంటారంట. అంతే కాకుండా చాలా ఓపికతో ఉంటారు. ఏ పనిని అయినా సరే చాలా సులభంగా చేసే నేర్పు కలిగి ఉంటారు. ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వీరు నిశ్శబద్ధంగా ఉంటూనే తమ జీవితంలో చాలా త్వరగా సక్సెస్ అందుకుంటారు. అలాగే ఎవరి పేరు అయితే టీ అనే అక్షరంతో ప్రారంభం అవుతుందో వారు తమ సమస్యలు లేదా ఎదుర్కొనే సవాళ్ల గురించి ఇతరులతో చర్చించడానికి ఇష్టపడరు. చాలా మొండి స్వభావం కలిగి ఉంటారు.

అంతే కాకుండా వీరు తమ జీవితంలో చాలా త్వరగా సెటిల్ అవుతారు. ఎంత కష్టమైన పని అయినా సరే చాలా సులభంగా పూర్తి చేయాలనే స్వభావం కలిగి ఉంటారు. అంకిత భావం, అత్యుత్తమ ప్రతిభతో తమ పనిని పూర్తి చేసుకొని, అందరిచే మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. అంతే కాకుండా ఈ టీ అనే అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వారు అందరికంటే భిన్నంగా మంచి తెలివి తేటలను కలిగి ఉంటారు. వీరు ప్రతి ఒక్కరినీ ఆకర్షించే రూపం కలిగి ఉంటారు.

అదే విధంగా టీ అనే అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులు తమ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపడానికి ఇష్టపడతారు. స్నేహితులకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు. ముఖ్యంగా వీరు విశాఖ నక్షత్రానికి చెందిన వారు కావడంతో వీరి మనసు కూడా చాలా ఉన్నతంగా ఉంటుంది. అలాగే వీరు చాలా దయాగుణం కలిగినవారు. ఇతరులకు సహాయం చేయడంలో ముందుంటారు.

వీరి ఆశయాలు కూడా చాలా పెద్దగా ఉంటాయి. అయితే కొన్ని సార్లు వీరు వారి కలలను నెరవేర్చుకోవడానికి తప్పుడు మార్గాలను కూడా అనుసరించే ధోరణి కలిగి ఉంటారు. కానీ వీరి నక్షత్రానికి అధిపతి గురుడు అయినందు వలన వీరు తమ డ్రీమ్స్‌ను సరైన విధానంలోనే నెరవేర్చుకునే జ్ఞానాన్ని అందిస్తాడు.నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు