
సింహ రాశి : సింహ రాశి, ఈ రాశి సూర్యునిచే పాలించబడుతుంది. అందువలన వీరిలో నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. వీరికి కూడా ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అన్నివిధాలుగా కలిసి వస్తుంది. సమాజంలో వీరికంటూ ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. అలాగే కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది

వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారికి కూడా ఇది చాలా మంచి సమయం. వీరికి ఇది అనేక ప్రయోజనాలు చేకూర్చుతుంది. ఈ రాశి వారు ఆస్తులు సంపాదించుకునే సమయం. ఆర్థికంగా కలిసి వస్తుంది. ఆదాయం కూడా త్రిబుల్ అవుతుంది. అన్నివిధాలుగా వీరికి చాలా అద్భుతంగా కలిసి వస్తుంది. ఇంటా బటయ సంతోషకర వాతావరణం నెలకుంటుంది.

కన్యా రాశి : కన్యా రాశి వారికి కూడా ఇది చాలా మంచి సమయం. అనుకున్న పనులను సమయానుగుణంగా పూర్తి చేసుకుంటారు. అనవసరమైన ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించడం మంచిది. ఈ సమయంలో వీరు పెట్టే పెట్టుబడి జీవితంలో అనేక ప్రయోజనాలు తీసుకొస్తుంది. అందువలన ఒకటికి రెండు సార్లు ఆలోచించి మంచి దాంట్లో పెట్టుబడి పెట్టాలి.

మకర రాశి : మకర రాశి వారు ఈ సమయంలో అంకిత భావంతో పని చేస్తారు. వీరికి అన్నింట్లో శుభ ఫలితాలు కలుగుతాయి. అంతే కాకుండా ఆదాయం డబుల్ అవుతుంది. చాలా రోజుల నుంచి విదేశీ ప్రయాణాలు చేయాలి అనుకునేవారికి ఇది మంచి సమయం. అన్నివిధాలుగా కలిసి వస్తుంది. పట్టింది బంగారమే, ముట్టింది ముత్యమే అవుతుంది.

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు