శ్రావణ మాసంలో పాములు ఎందుకు ఎక్కువగా కనిపిస్తాయి? దీని వెనక కథ తెలుసా?

Updated on: Aug 03, 2026 | 6:55 AM

అన్ని మాసాల్లోకెల్లా శ్రావణ మాసం చాలా ప్రత్యేకమైనది. ఈ మాసంలో ప్రతి ఒక్కరూ నిత్యం శివారాధన చేస్తుంటారు. అయితే ఈ మాసంలో పాములు ఎక్కువగా కనిపిస్తాయి అంటుంటారు. ఇది చిన్నప్పటి నుంచి వింటూనే ఉంటాం. మరి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు శ్రావణ మాసంలో పాములు ఎందుకు ఎక్కువగా కనిపిస్తాయో? కాగా, ఇప్పుడు మనం దాని గురించి వివరంగా తెలుసుకుందాం.

1 / 5
శ్రావణ మాసంలో పాములు ఎక్కువగా కనిపించడం వెనుక అనేక కారణాలు ఉన్నాయి. ఒకొక్కరూ ఒక్కో విధంగా చెబుతుంటారు. కాగా, ఇప్పుడు మనం దీని వెనకున్న  శాస్త్రీయ పరమైన, మతపరమైన కారణాలు ఏవో వివరంగా తెలుసుకుందాం. శ్రావణ మాసం అంటే ఈ సమయంలో ఎక్కువగా వర్షాలు పడుతుంటాయి. అంతే కాకుండా వాతావరణం ఎప్పుడూ కూడా తేమగా ఉంటుంది. దీని వలన పాములు నివసించే బొరియల్లో నీరు నిలిచిపోతుంది. దీంతో, ఇవి ఇళ్లు, తోటల్లో తిరుగుతూ ఉంటాయంట.

2 / 5
 నీటితో బొరియలు నిండిపోయినప్పుడు, అవి శ్వాస తీసుకోవడం కష్టం అవుతుంది. అందుకోసం, అవి పొడి నేలలను వెతుక్కోవడం కోసం బయటకు వచ్చి, తిరుగుతుంటాయి.  అంతే కాకుండా ఈ సమయంలో కప్పలు కూడా ఎక్కువగా బయట సంచారం చేస్తుంటాయి. వర్షాకాలంలో కప్పలు సంతానోత్పత్తి సమయం. అందువలన అవి ఎక్కువగా బయట సంచారం చేస్తుంటాయి. అయితే వీటిని ఆహారంగా తీసుకోవడం కోసం పాములు ఎక్కువగా బయటతిరుగుతాయంట.

3 / 5
అంతే కాకుండా శాస్త్రీయ పరంగా చూస్తే, జూలై, ఆగస్టు నెలలో పాముల సంతానోత్పత్తి కాలం అని కూడా అంటారు. అందుకోసమే ఇవి ఈ సమయంలో తమ జతల కోసం వెతుకుతూ, ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి మారుతాయంట. అంతే కాకుండా ఆహారం కూడా వెతుకుతూ ఉంటాయంట.  అందువల్లనే శ్రావణ మాసంలో పాములు ఎక్కువగా కనిపిస్తాయని చెబుతుంటారు.

4 / 5
ఇక మతపరమైన నమ్మకంగా చూస్తే, శ్రావణ మాసం అంటే శివుడికి చాలా ప్రీతికరమైన మాసం. అందుకే ఈ మాసంలో శివ నామస్మరణ చేస్తుంటారు. అంతే కాకుండా ఈ సమయంలో సర్ప దేవుడు శివుడిని ఆవరించి ఉంటాడంట. అందువలన ఈ మాసంలోనే నాగపంచమి వేడుకలు జరుపుకుంటారు. పాములకు ప్రత్యేక పూజలు చేస్తారు. అందుకే ఈ సమయంలో పాములు ఎక్కువగా కనిపిస్తాయని అంటుంటారు.

5 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

Loading...
Unable to load recommendations.
Follow Us