మహాలయ అమావాస్య రోజున సూర్యగ్రహణం.. ఈ నాలుగు రాశులపై కనక వర్షం.. ఈ పరిహారాలు ఫలవంతం..

Updated on: Sep 10, 2025 | 11:47 AM

ఈ నెలలో భాద్రప్రద పౌర్ణమి రోజున అంటే పితృ పక్షం ప్రారంభం రోజున చంద్రగ్రహణం ఏర్పడింది. ఇప్పుడు అంటే 15 రోజులకు భాద్రప్రద అమావాస్య రోజున సూర్యగ్రహణం సంభవించనుంది. అయితే ఈ సూర్య గ్రహణం భారత దేశంలో కనిపించదు. అయినప్పటికీ రాశులపై మంచి చెడుల ఫలితాలను చూపిస్తుంది. సంవత్సరంలో చివరి సూర్యగ్రహణం ఈ 4 రాశుల వారికి అదృష్ట వర్షాన్ని కురిపిస్తుంది. ఆ రాశులు ఏమిటంటే..

1 / 6
 
ఈ సంవత్సరం సెప్టెంబర్ 21న సూర్యగ్రహణం సంభవిస్తుంది. ఈ గ్రహణం మహాలయ అమావాస్య రోజున సంభవిస్తుంది. కనుక ఈ గ్రహణం మరింత ప్రత్యేకమైనదిగా పండితులు భావిస్తున్నారు. సెప్టెంబర్ 21న రాత్రి 11:00 గంటలకు గ్రహణం ప్రారంభమై మర్నాడు ఉదయం 3:24 గంటల వరకు ఉంటుంది. ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు. అందువల్ల గ్రహణ సూతక కాలం వర్తించదు. అయితే న్యూజిలాండ్, ఫిజి దీవులు, ఆస్ట్రేలియా, అంటార్కిటికా, పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రంలో సూర్యగ్రహణం కనిపిస్తుంది.

2 / 6
జ్యోతిషశాస్త్రం ప్రకారం సూర్యగ్రహణం జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యంగా పితృ పక్షంలో రానున్న ఈ గ్రహణం ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఈ కాలంలో శుభ, అశుభ శక్తులు రెండూ బలంగా ఉంటాయి. ఈ కాలంలో నివారణలు, ఆచారాలు సరిగ్గా నిర్వహిస్తే సానుకూల మార్పులు సంభవిస్తాయి. గ్రహణ ప్రభావాలను అర్థం చేసుకుని, నివారణలను సరిగ్గా చేయాలి. ఈ గ్రహణం కన్యారాశిలో ఏర్పడనుంది. పండితులు ఈ గ్రహణం కొంతమందికి ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పారు.

3 / 6
వృషభ రాశి: వృషభ రాశి 11వ ఇంట్లో సూర్యగ్రహణం జరుగుతోంది. ఇది ఆదాయం, లాభం, సామాజిక సంబంధాలను సూచిస్తుంది. మీన రాశి అధిపతి బృహస్పతి ఇప్పుడు వృషభ రాశిలో ఉన్నాడు. దీని కారణంగా ఆర్థిక ప్రయోజనాలున్నాయి. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు, డబ్బు లావాదేవీలలో లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ రాశికి చెందిన వ్యక్తుల మాటలు మితంగా ఉండి.. ప్రవర్తనలో వినయం ఉంటే..  విజయం సాధించవచ్చు. సూర్యగ్రహణం తర్వాత గోధుమలను దానం చేయడం వల్ల అదృష్టం పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో అడ్డంకులు తొలగిపోతాయి.

4 / 6
మిథున రాశి: ఈ రాశి పదవ ఇంట్లో సూర్యగ్రహణం సంభవించబోతోంది. దీనిని పని, వృత్తికి నిలయంగా పరిగణిస్తారు. ఈ కారణంగా సూర్యగ్రహణం తర్వాత వీరి కెరీర్ మంచి అడుగు వేస్తుంది. ఇంతకు ముందు ఒక ప్రాజెక్ట్‌లో పెట్టుబడి పెట్టి ఉంటే లేదా ఏదైనా ప్రయత్నం పూర్తి కాకపోతే.. దాని ప్రయోజనాలు వీరికి లభిస్తాయి. మాట్లాడే నైపుణ్యం, వ్యాపార పరిజ్ఞానం, నిర్వహణ నైపుణ్యాల కారణంగా వీరి కెరీర్ అద్భుతంగా ఉంటుంది. ఈ సమయంలో చిన్న సమస్యలు తలెత్తవచ్చు. అయితే అవన్నీ మంచులాగా మాయమవుతాయి. ఈ రాశికి చెందిన వ్యక్తులు తమ కృషికి తగిన ఫలితాన్ని పొందుతారు. సూర్యగ్రహణం తర్వాత పేదలకు రాగి వస్తువులను దానం చేయడం వలన జీవితంలో స్థిరత్వాన్ని పెంచుతుంది.

5 / 6
మకర రాశి: మకర రాశి వారికి సూర్యగ్రహణం మూడవ ఇంట్లో జరగబోతోంది. ఇది ధైర్యం, కృషి, తోబుట్టువులు, చిన్న ప్రయాణాలతో ముడిపడి ఉన్న ఇల్లు. ఈ సూర్యగ్రహణం వీరికి అపారమైన మనశ్శాంతిని ఇస్తుంది.  కెరీర్, వ్యాపార రంగంలో కొత్త ఎత్తులకు చేరుకుంటారు. రాజకీయాలు, సామాజిక రంగాలతో సంబంధం ఉన్న వారి పట్ల గౌరవం పెరుగుతుంది. సమాజంలో ప్రభావం పెరుగుతుంది. తోబుట్టువులతో సంబంధం బలపడుతుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. పూర్వీకుల ఆస్తి లభించే అవకాశం ఉంది. సూర్యగ్రహణం తర్వాత నల్ల నువ్వులు లేదా మినప పప్పు దానం చేయడం వల్ల విజయానికి మార్గం సుగమం అవుతుంది.

6 / 6
కుంభ రాశి: కుంభ రాశి రెండవ ఇంట్లో సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఇది డబ్బు, వాక్చాతుర్యం , కుటుంబ విషయాలకు సంబంధించినది. ఈ గ్రహణం అనేక ఊహించని ప్రయోజనాలను తెస్తుంది. ఇంతకు ముందు ఏదైనా డబ్బు సంబంధిత విషయాలలో పెట్టుబడి పెట్టి ఉంటే.. ఆ పెట్టుబడుల నుంచి లాభాలు అందుకుంటారు. బీమా, బోనస్‌, వారసత్వంగా వచ్చిన ఆస్తి నుంచి కూడా డబ్బు పొందే అవకాశం ఉంది. పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తుంటే.. ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో పాత సమస్యలు పరిష్కారమవుతాయి. ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. సూర్యగ్రహణం తర్వాత బియ్యం దానం చేయడం వలన ఒత్తిడి నుంచి ఉపశమనం ఇస్తుంది.