
శుక్రగ్రహం ప్రేమకు, ఆనందానికి చిహ్నం. అయితే ఈ గ్రహం తుల రాశిలో వక్రగతిలో సంచారం చేస్తూ చిత్తా నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. డిసెంబర్ 5 వరకు ఇదే నక్షత్రంలో ఉంటాడు. దీని ప్రభావం నాలుగు రాశులపై ఉంటుంది. దీని వలన శుక్రుడి ప్రభావంతో ప్రేమ, వివాహం వంటి విషయాల్లో కలిసి వస్తుంది. కాగా, ఇది ఏ రాశుల వారికి కలిసి వస్తుందో ఇప్పుడు చూద్దాం.

కుంభ రాశి : కుంభ రాశి వారికి శుక్రుడి అనుగ్రహంతో ప్రేమ వ్యవహారాలు కలిసి వస్తాయి. చాలా కాలంగా ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్న వారికి ఇదే మంచి సమయం, మీ లవ్ వంద శాతం సక్సెస్ అవుతారు. లవ్ లో ఉన్నవారి పెళ్లికి ఇంట్లో పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గి, రొమాంటిక్ టూర్ వెళ్లే యోగం ఉంది.

తుల రాశి : తుల రాశికి శుక్రుడు అధిపతి కావడం వల్ల ఈ సంచారం మీకే బాగా కలిసి వస్తుంది. మీ అందం, ఆకర్షణ రెట్టింపు అవుతుంది. మీ మనసులో ఉన్న వ్యక్తి మీకే దగ్గరవుతాడు. సింగిల్ గా ఉన్నవారికి కొత్త ప్రేమ పుడుతుంది. లవర్స్ మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోయి, పెళ్లి పీటలు ఎక్కడం ఖాయం. చాలా అద్భుతంగా కలిసి వస్తుంది.

వృశ్చిక రాశి :వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో ప్రేమలో గెలవడం ఖాయం. వన్ సైడ్ లవ్ లో ఉన్నవారికి కూడా మంచి రోజులు వచ్చాయి. మీ ప్రేమను వ్యక్తపరిస్తే ఎదుటివారు కాదనకుండా ఒప్పుకుంటారు. చాలా రోజులుగా బ్రేకప్ బాధలో ఉన్నవారికి మళ్లీ పాత ప్రేమికుడు, ప్రేమికురాలు తిరిగి వచ్చే అవకాశం ఉంది. పెళ్లి కాని వారికి సంబంధం కుదురుతుంది. లవ్ సక్సెస్ అవుతుంది.

మకర రాశి : మకర రాశి వారికి శుక్రుడి ప్రభావంతో లవ్ లైఫ్ సూపర్ గా ఉంటుంది. ప్రేమికులిద్దరూ కలిసి భవిష్యత్తు గురించి పెద్ద నిర్ణయం తీసుకుంటారు. ఉద్యోగం, ప్రేమ రెండింటి లో బ్యాలెన్స్ చేసి సక్సెస్ అవుతారు. పెళ్లైన వారికి శుభవార్త, హనీమూన్ ప్లాన్ చేసుకునే అవకాశం. మొత్తంగా ఈ నెల మీకు ప్రేమమయంగా ఉంటుంది. చాలా ఆనందంగా జీవితాన్ని కొనసాగుతారు.