
కర్కాటక రాశి : శని అమావాస్య తర్వాత కర్కాటక రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. వీరికి ఊహించని విధంగా ప్రయోజనాలు చేకూరుతాయి. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేసుకుంటారు. ఆదాయం రెట్టింపు అవుతుంది. మొండి బాకీలు వసూలు అవుతాయి. అన్ని విధాలుగా ఈ రాశి వారికి చాలా అద్భుతంగా కలిసి వస్తుంది.

తుల రాశి : ఈ రాశి వారు త్వరితగతిన పనులు పూర్తి చేస్తారు. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ఆనందకర జీవితాన్ని గడుపుతారు. ముఖ్యంగా ఎవరు అయితే ఆర్థిక సమస్యలతో సతమతం అయ్యారో వారి సమస్యలన్నింటికీ ఇక ముగింపు వచ్చినట్లే, వీరికి వ్యాపార పరంగా కలిసి వస్తుంది. అంతే కాకుండా రియలెస్టేట్ రంగంలో ఉన్నవారికి అద్భుతంగా కలిసి వస్తుంది.

మేష రాశి : మేష రాశి వారికి అయితే పట్టింది బంగారమే ముట్టింది ముత్యమే అని చెప్పాలి వీరికి, అన్ని విధాలుగా చాలా అద్భుతంగా ఉంటుంది. అన్నింట్లో వీరిదే పై చేయి అవుతుంది. కళారంగంలో ఉన్నవారు అవార్డులు, రివార్డులు అందుకునే ఛాన్స్ ఉంది. వీరికి ఇది అద్భుతమైన సమయం అని చెప్పుకోవాలి. ఈ రాశి వారు బంగారం కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది.

సింహ రాశి : సింహ రాశివారికి శని అమావాస్య సమస్యలను తొలిగించి, ఆనందకర జీవితాన్ని అందిస్తుంది. వీరికి అన్నింట్లో శుభ ఫలితాలు కలుగుతాయి. శని అనుగ్రహం ఉండటం వలన ఆగిపోయిన పనులు కూడా చాలా త్వరగా పూర్తి అవుతాయి. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది.

కన్యా రాశి : కన్యారాశి వారికి ఇది చాలా అనుకూల సమయం. వీరు ఏం చేసినా కలిసి వస్తుంది. అంతే కాకుండా వీరు ఆర్థికంగా చాలా బలంగా తయారు అవుతారు. కెరీర్ పరంగా కూడా బాగుంటుంది. శని ప్రభావం వలన వీరికి ఉన్న అనారోగ్య సమస్యలు అన్నీ తొలిగిపోయి చాలా ఆనందంగా జీవిస్తారు.