
మేష రాశి : మేష రాశి వారికి శని, కుజ గ్రహాల కలయిక వలన అద్భుతమైన ప్రయోజనాలు కలుగతాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. చాలా రోజుల నుంచి ఎవరు అయితే విదేశీ ప్రయాణం చేయాలి అనుకుంటున్నారో వారికి ఇది చాలా అద్భుతమైన సమయం. అలాగే ఈ రాశి వారు తమ సంతానం నుంచి శుభ వార్తలు వింటారు. అన్ని విధాలుగా వీరికి కలిసి వస్తుంది.

సింహ రాశి : సింహ రాశి వారికి కూడా ఇది చాలా బెస్ట్ సమయం అని చెప్పాలి. దూర ప్రయాణాలు అద్భుతంగా కలిసి వస్తాయి. చాలా రోజుల నుంచి పెండింగ్‌లో ఉన్న పనులను సమయానుగుణంగా పూర్తి చేస్తారు. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. సమాజంలో వీరికంటూ ప్రత్యేక స్థానం లభిస్తుంది. అనుకోని విధంగా ఆదాయం రెట్టింపు అవుతుంది.

తుల రాశి : తుల రాశి వారికి ధనలాభం కలుగుదు. ఆరోగ్యం బాగుంటుంది. ఈ రాశి విద్యార్థులు పెద్ద పెద్ద కాలేజీల్లో సీటు సంపాదించుకుంటారు. ఆర్థికంగా కలిసి వస్తుంది. విదేశీ ప్రయాణాలకు అనుకూల సమయం. ఈ రాశి వారు ఏదైనా ఒక సమయంలో గతంలో ఎవరికి అయినా డబ్బు ఇచ్చి ఉంటే, అది మళ్లీ చేతికి అందే అవకాశం ఉంది. అన్నివిధాలుగా వీరికి కలిసి వస్తుంది.

మకర రాశి :మకర రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. పట్టింది బంగారమే అవుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. కుటుంబ జీవితంలో ప్రశాంతత నెలకుంటుంది. ఆర్థికంగా అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది.

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు