
నేమ్ ఆస్ట్రాలజీ ప్రకారం ఎస్ అనే అక్షరంతో పేరు ప్రారంభం అవ్వడం, స, శ, శ్రీ ఈ అక్షరాలతో పేరు ప్రారంభమయ్యే వారు అందరూ S లెటర్ కిందకు వస్తారు. ఇక ఈ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వారు చాలా అదృష్టవంతులు అని చెప్పాలి. వీరు చాలా సౌమ్యంగా ఉండటమే కాకుండా, పరిస్థితుల ప్రకారం నడుచుకుంటారు. వీరికి ముందు చూపు చాలా ఎక్కువగా ఉంటుంది.

నేమ్ ఆస్ట్రాలజీ ప్రకారం S అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వారు ఇతరులతో చాలా త్వరగా కలిసిపోయే స్వభావం ఉంటుంది. కానీ వీరు ఇతరులతో కలవడానికి చాలా సమయం తీసుకుంటారు. కెరీర్ పై మంచి అవగాహన ఉంటుంది. వీరు మాట్లాడే తీరు, ప్రవర్తన ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. కానీ కొన్ని సార్లు ఇదే వీరికి అనేక సమస్యలను తీసుకొచ్చే ప్రమాదం ఉంది. అందువలన వీరు ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది. ప్రతి పనిలో విజయం సాధించాలనే తపన ఎక్కువగా ఉంటుంది.

కొన్నిసార్లు విపరీతమైన మొండితనంగా ఉండారు. కష్టపడే తత్వం ఎక్కువగా ఉంటుంది. అందరినీ సులభంగా నమ్ముతారు. కొన్ని సార్లు ఇదే వీరిని అనేక సమస్యల్లోకి నెట్టి వేస్తుంది. అంతే కాకుండా ఈ ఎస్ లెటర్‌తో పేరు ప్రారంభమయ్యే వారికి ప్రేమ, అనురాగాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా వీరికి ప్రేమపై చాలా నమ్మకంగా ఉంటంది. ఒక వ్యక్తిని ఎంతగా నమ్ముతారో, ఆ వ్యక్తి మోసం చేస్తే మాత్రం అంతకు అంత ప్రతీకారం తీర్చుకుంటారు. మోసాన్ని అస్సలే తట్టుకోరు.

ఆర్థికంగా కూడా వీరికి చాలా బాగుంటుంది. వీరు చాలా డబ్బు సంపాదిస్తారు. కానీ వాటిని నిలుపుకోవడంలో విఫలం అవుతారు. కానీ ఈ ఎస్ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వారికి వయసు 35 ఏళ్లు దాటిన తర్వాత స్థిరత్వం వస్తుంది. అప్పుడు వీరు ధనవంతులు అయ్యే ఛాన్స్ ఉంది. ఎంత కష్టపడ్డారో, 35 సంవత్సరాల తర్వాత అంత గొప్పగా బతుకుతారు.

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు