
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడికి చాలా ఇష్టమైన నక్షత్రంలో రోహిణి నక్షత్రం ఒకటి. అందువలన అన్ని కార్తెలలో కంటే, రోహిణి కార్తెలో పుట్టిన వారు కాస్త స్పెషల్‌గా ఉంటారంట. ముఖ్యంగా వీరు ప్రత్యేకమైన ఆకర్షణ కలిగి ఉండటమే కాకుండా, ఎక్కడికి వెళ్లినా ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షిస్తారు. అంతే కాకుండా వీరి ముఖ కవలికలు, నవ్వు, మాట తీరు, అన్ని కూడా ఆకట్టుకునేలా ఉంటాయి. చంద్ర బింబంలాంటి మోము కలిగి ఉంటారని చెబుతున్నారు పండితులు.

ఆర్థికంగా కూడా వీరు చాలా దృఢంగా ఉంటారు. వీరు కష్టపడి పనిచేసే తత్వం కలిగి ఉండే వారు. వీరిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉండటం వలన ఆర్థికంగా ఎలాంటి సమస్యలు ఎదురు అవ్వవు. కష్టపడకపోయినా సరే డబ్బు వీరి వద్దకు వస్తుంది. తెలివి తేటలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి.

అలాగే రోహిణి కార్తెలో జన్మించిన వారికి కళా నైపుణ్యం చాలా ఎక్కువ అని చెబుతున్నారు పండితులు. ఈ సమయంలో జన్మించిన వారు అన్ని రంగాల్లో తమ ప్రతిభకనబరుస్తారు. ముఖ్యంగా డ్యాన్స్, పేయింటింగ్, పాటలు పాడటం వంటి వాటిలో మంచి నైపుణ్యాన్ని కలిగి ఉంటారు.

ప్రేమ పరంగా చూస్తే, వీరి మనసు పాల కంటే స్వచ్ఛమైనది అని చెప్పాలి. వీరు ఒక వ్యక్తిని ఇష్టపడితే ప్రాణం ఇవ్వడానికి కూడా వెనకాడరు. అంతలా ప్రేమను చూపెడతారు. ముఖ్యంగా ఈ రోహిణి కార్తెలో జన్మించిన వారి వివాహం చేసుకునే వారు చాలా అదృష్ట వంతులు అని చెప్పాలి. వీరు అందరికీ ఇష్టం ఉంటుంది. అలాగే వీరు అందరికీ ప్రేమను పంచుతారు, అందరి నుంచి ప్రేమను పొందుతారు.

వీరికి సంతాన పరంగా కూడా లక్కు కలిసి వస్తుంది.రోహిణి కార్తెలో జన్మించిన వారు సంతానం వలన లబ్ధి పొందుతారు. వీరి పిల్లలు చాలా తెలివైన వాళ్లు, పేరు ప్రఖ్యాతుల తెస్తారు. నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు