మీ ఇంట్లో డబ్బు నిలవడం లేదా.. శని వారం ఇలా చేస్తే చాలు అప్పుల సమస్యలు పరార్!

Updated on: Apr 24, 2026 | 11:00 AM

ఈ మధ్య కాలంలో చాలా మంది ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారు. ఇంటిలో డబ్బు నిలువక, ఎంత కష్టపడినా సరే ఖర్చులు అధికం అయ్యి, పొదుపు అనేది లేకుండా చాలా ఇబ్బందులు పడుతుంటారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం శని వారం ఈ చిన్న పరిహారం చేయడం వలన అప్పుల బాధలన్నీ తీరిపోతాయంట. కాగా, ఆ పరిహారాలు ఏవో ఇప్పుడు చూసేద్దాం.

1 / 5
వాస్తు శాస్త్రానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ఏ పని ప్రారంభించినా తప్పకుండా వాస్తు అనేది చూసుకుంటారు. ఇక ఎవరు అయితే సరిగ్గా వాస్తు నియమాలు పాటిస్తారో, వారు చాలా ఆనందంగా, ఎలాంటి ఆర్థిక, అనారోగ్య సమస్యలు లేకుండా జీవిస్తారని చెబుతుంటారు. ఇక కొంత మంది తెలిసి, తెలియక చేసిన తప్పుల వలన అనేక ఇబ్బందులు, ముఖ్యంగా ఆర్థిక సమస్యలు ఎదుర్కుంటారు. అయితే అప్పుల బాధలతో సతమతం అయ్యేవారు  శని వారు రోజు కొన్ని ప్రత్యేక నియమాలు పాటించాలంట. దీని వలన శని దేవుడి అనుగ్రహం కలిగి రుణ బాధల నుంచి విముక్తి లభిస్తుందంట. అది ఏదో చూద్దాం.

2 / 5
శని వారం శని దేవుడితో ముడి పడి ఉన్న రోజు. ఈరోజు శని దేవుడికి ప్రత్యేక పూజలు, పరిహారాలు చేయడం వలన అనేక సమస్యల నుంచి బయటపడతారు అంటారు. అలాగే ఈ రోజు కొన్ని పనులు చేయడం వలన శని దేవుడి అనుగ్రహం కలిగి,  ఆర్థిక సమస్యలు తీరిపోతాయంట.  అవి ఏవో చూద్దాం. తప్పకుండా ప్రతి శని వారం ఇంటిని మొత్తం శుభ్రపరుచుకోవాలి. ఈరోజు ఇంటిలో ఉన్న చెత్తను, పనికి రాని వస్తువులను తీసి బయట వేయాలి. అలాగే ఇంటిని శుభ్రపరుచుకోవాలి. ఇలా చేయడం వలన ఇంటిలో సానుకూల శక్తి పెరిగి, ప్రతికూల శక్తి తగ్గిపోతుంది. అలాగే ఆర్థిక సమస్యలు కూడా తొలిగిపోతాయి.

3 / 5
అప్పుల బాధలు తొలిగిపోయి, ఆనందకరమైన జీవితం గడపాలి అంటే, ఆవనూనెతో దీపాన్ని వెలిగించాలి. ఇలా చేయడం వలన ఆర్థిక, సమస్యలు అన్నీ తొలిగిపోతాయి. అయితే ఈ ఆవ నూనె దీపాన్ని ఇంటి పూజ మందిరం లేదా రావి చెట్టు కింద అయినా వెలిగించ వచ్చును. ఇలా చేయడం వలన జీవితంలో ఉన్న ఆర్థిక సమస్యలు తొలిగి పోవడమే కాకుండా, మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఈ రోజు నల్ల కాకులకు, నల్ల కుక్కలకు ఆహారం పెట్టడం కూడా చాలా మంచిది. దీని వలన మీకు కలిసి వస్తుంది. రొట్టెలు చేసి వాటికి కొంచెం ఆవ నూనె రాసి పెట్టడం వలన విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.

4 / 5
దాన ధర్మాలు చేయడం కూడా చాలా మంచిది. శని వారం రోజు ఎవరు అయితే వస్తువులు, నల్ల నువ్వులు, ఆవ నూనె, దుప్పట్లు దానం చేస్తారో వారికి కలిసి వస్తుంది. ముఖ్యంగా ఏడు వారాలు ప్రతి వారం ఇలా చేయడం వలన ఇంటిలో ఉన్న ప్రతికూల శక్తి తగ్గిపోయి, జీవితంలోని ఆర్థిక సమస్యలు తొలిగిపోయి, ఆనందకర జీవితాన్ని కొనసాగిస్తారు. అన్ని విధాలుగా చాలా ఆనందంగా ఉంటారు. ఇది మీకు ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా అన్ని విధాలుగా లాభాలను చేకూరుస్తుంది.

5 / 5
అదే విధంగా నిత్యం అప్పుల సమస్యలతో బాధపడే వారు, అసలు ఎంతకూ అప్పులు తీరక ఇబ్బందులు పడే వారు ప్రతి శని వారం ఇనుప వస్తువులు దానం చేయడం చాలా మంచిది. ముఖ్యంగా వాస్తు శాస్త్రం ప్రకారం ఈ రోజు ఇనుము వస్తువులు దానం చేయడం వలన చాలా మంచి జరగడమే కాకుండా శని దేవుడి ఆశీస్సులు కూడా లభిస్తాయి. ఇనుప వస్తువులు దానం చేయడం వలన ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. క్రమంగా అప్పుల బాధలు తగ్గుతాయి. అయితే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఇనుప వస్తువులు కొనుగోలు చేయకూడదు. ఇది అస్సలే మంచిది కాదు. (Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది)

Follow Us