
Saturn Transit: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి గ్రహం నిర్దిష్ట కాలంలో తన రాశిని మార్చుకుంటూ ఉంటుంది. ఈ గ్రహ సంచారాల ప్రభావం మొత్తం 12 రాశులపై పడుతుంది. కొన్ని సందర్భాల్లో గ్రహాల ప్రత్యేక కలయికల వల్ల శుభయోగాలు ఏర్పడి, కొన్ని రాశుల వారికి విశేష ఫలితాలు అందిస్తాయి. అలాంటి అరుదైన యోగాల్లో ఒకటైన “కేంద్ర దృష్టి యోగం” జూన్ 10న ఏర్పడనుంది. ఈ రోజు బుధుడు, శని గ్రహాలు పరస్పరం 90 డిగ్రీల కోణంలో ఉండటం వల్ల ఈ శుభయోగం ఏర్పడుతోంది. ఈ యోగం ప్రభావం అన్ని రాశులపైనా ఉన్నప్పటికీ, ముఖ్యంగా నాలుగు రాశుల వారికి మంచి ఫలితాలు దక్కనున్నాయి.

మేష రాశి.. కేంద్ర దృష్టి యోగం మేష రాశి వారికి శుభ ఫలితాలను అందిస్తుంది. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు పూర్తి కావచ్చు. చిన్న చిన్న సమస్యలు తొలగి మానసిక ప్రశాంతత లభిస్తుంది. తోబుట్టువుల సహకారం పెరుగుతుంది. కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకునేవారికి ఇది అనుకూల సమయం. ఉద్యోగంలో ఉన్నవారికి ఉన్నతాధికారుల ప్రశంసలు లభించే అవకాశం ఉంది. వ్యాపారంలో ఊహించని లాభాలు రావచ్చు. ఈ సమయంలో ఆత్మవిశ్వాసం, ధైర్యం పెరిగి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

కన్య రాశి.. కన్య రాశి వారికి ఈ యోగం మంచి పురోగతిని తీసుకురానుంది. ఉద్యోగంలో గుర్తింపు, పదోన్నతి లేదా జీతం పెరుగుదల వంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆస్తి సంబంధిత సమస్యలు పరిష్కారం కావచ్చు. పాత అప్పుల భారం తగ్గే అవకాశం ఉంది. కుటుంబంలో శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. వివాహానికి ఎదురవుతున్న అడ్డంకులు తొలగి మంచి సంబంధాలు రావచ్చు. స్నేహితులు, తోబుట్టువుల సహాయం కూడా లభిస్తుంది. విదేశీ ప్రయాణ అవకాశాలు కలగొచ్చు.

తులా రాశి.. తులా రాశి వారికి కేంద్ర దృష్టి యోగం అనుకూల ఫలితాలను అందిస్తుంది. మీరు చేపట్టిన పనులు విజయవంతమవుతాయి. ముఖ్యంగా మీడియా, కళలు, సృజనాత్మక రంగాల్లో ఉన్నవారికి మంచి అవకాశాలు లభించవచ్చు. వివాహ యత్నాలు సఫలమయ్యే సూచనలు ఉన్నాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభవార్త అందవచ్చు. కుటుంబ సభ్యుల మద్దతుతో విదేశీ ప్రయాణ అవకాశాలు కూడా కలుగుతాయి.

కుంభ రాశి.. కుంభ రాశి వారికి ఈ యోగం ఆర్థికంగా, వృత్తిపరంగా లాభదాయకంగా ఉంటుంది. భూమి, ఆస్తి వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. కొత్త వ్యాపార అవకాశాలు రావచ్చు. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. భాగస్వామ్య వ్యాపారాల్లో ఉన్న సమస్యలు తగ్గవచ్చు. ఉద్యోగంలో గుర్తింపు పెరుగుతుంది. కుటుంబంలో ఆనందకర వాతావరణం నెలకొంటుంది. పిల్లల నుంచి శుభవార్త వింటారు. దంపతుల మధ్య ఉన్న విభేదాలు తగ్గే సూచనలు ఉన్నాయి. (Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిషం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)