
మేష రాశి : మేష రాశి వారు ఆర్థికపరమైన సమస్యలు ఎదుర్కుంటారు. ఎంత పని చేసినా కష్టానికి తగిన ఫలితం అందదు, ఆర్థికంగా, ఆరోగ్య పరంగా అన్నివిధాలుగా వీరు ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. అందుకే వీరు ఈ సమయంలో ఏ పనులు చేయకపోవడమే మంచిది. లేకపోతే ఇబ్బందులు అధికం అవుతాయి.

కర్కాటక రాశి : కర్కాటక రాశి వారు ప్రతి విషయంలో ఆచీ తూచి అడుగు వేయాలి. లేకపోతే సమస్యలు తీవ్రతరం అవుతాయి. ఆదాయం కూడా పూర్తిగా తగ్గిపోతుంది. ముఖ్యంగా కడుపు నొప్పి, తలనొప్పి వంటి సమస్యలు అధికం అవుతాయి. వీరు చాలా ఇబ్బందులు ఎదుర్కుంటారు. ఎంత ఓపిక ఉంటే అంత మంచిది.

కుంభ రాశి : కుంభ రాశి వారికి వ్యతిరేకత ఎక్కువ అవుతుంది. విద్యార్థులు ఎంత కష్టపడినా మంచి ఫలితాన్ని పొందలేరు. మానసికంగా కుంగిపోతారు. ఉద్యోగం చేసే చోట కూడా వ్యతిరేకత ఎక్కవ అవుతుంది. దీంతో కార్యాలయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కుంటారు. కానీ వీరి ఓపిక సహనమే వీరికి బలం.

మీన రాశి : మీన రాశి వారికి చాలా అద్భుతమైన సమయం. అనుకున్న పనులు అన్నీ కూడా సమయానుగుణంగా పూర్తి చేసుకుంటారు. అయినప్పటికీ వీరికి సమస్యలు తప్పవు, కుటుంబంలో ఏర్పడే చిన్న గొడవలే పెద్దగా అవుతాయి. ఇవి వారిని మానసికంగా కుంగదీస్తాయి.

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు