
అనుకోని విధంగా జీవితం మలపు తిరుగుతుంది. అయితే ప్రస్తుతం కుంభ రాశిలో సంచరిస్తున్న రాహువు డిసెంబర్ వరకు ఇదే రాశిలో ఉంటాడు, అయితే ఈ సంచారం సమయంలో కొన్ని రాశుల వారిపై చెడు దృష్టి పడనున్నదంట. దీంతో మూడు రాశుల వారు అనేక ఇబ్బందులు ఎదుర్కునే ఛాన్స్ ఉందని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. కాగా, ఇప్పుడు మనం ఆ రాశులు ఏవో వివరంగా తెలుసుకుందాం.

మేష రాశి : మేష రాశి వారికి చాలా విపత్కర పరిస్థితులు ఎదురు అవుతాయి. కుటుంబ సభ్యుల నుంచే వ్యతిరేకత మొదలు అవుతుంది. వీరు చాలా మానసిక వేదనకు గురి అవుతుంటారు. అందుకే ఈ ఏడు నెలల పాటు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఏవైనా ముఖ్యమైన పనులు ఉంటే వాయిదా వేసుకోవడం మంచిది. ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. లేకపోతే అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

వృషభ రాశి : వృషభ రాశి వారికి ఆర్థిక సమస్యలు ఎక్కువ అవుతాయి. ఖర్చులు అధికం అవుతాయి. ఉద్యోగస్థులు సీనియర్స్ నుంచి ఒత్తిడి ఎదుర్కుంటారు. ముఖ్యంగా జాబ్ పోయే ఛాన్స్ కూడా ఉంది. అందుకే కార్యాలయంలో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి. ఎందుకంటే ఈ సమయంలో ఈ రాశి వారికి వాహన గండం ఉంది. అనుకోని ఇబ్బందులు ఎదురు అవుతాయి. ఆర్థికంగా చాలా నష్టపోతారు.

కర్కాటక రాశి : కర్కాటక రాశి వారికి కుటుంబంలో గొడవలు, వైవాహిక బంధంలో సమస్యలు చాలా ఇబ్బంది పెడతాయి. అలాగే ఈ రాశి వ్యాపారస్తులు ఎక్కవగా నష్టపోవాల్సి వస్తుంది. పెట్టుబడుల నుంచి ఎక్కువ మొత్తంలో ఆర్థిక నష్టం వాటిల్లుతుంది. అంతే కాకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇవి కూడా నిరాశను, ఖర్చునే మిగుల్చుతాయి. అందుకే కర్కాటక రాశి వారు ఏడు నెలల పాటు చాలా జాగ్రత్తగా ఉండాలి.

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు