పూజకు పూల మొగ్గలు ఉపయోగించవచ్చా? శాస్త్రాలు చెప్పే నిజం

Updated on: Nov 19, 2026 | 5:02 PM

పూజలో పువ్వులను ఉపయోగించడం సహజం. ముఖ్యంగా హిందూ మతంలో ఏ పూజ చేసినా పువ్వులు అనేది తప్పనిసరి. పువ్వులు లేకుండా పూజ చేయలేరు. ఇక ప్రతి ఒక్కరూ పూజ కోసం నిండుగా పూసిన పువ్వులను ఉపయోగిస్తుంటారు. కొందరు తెలిసి తెలియక పూల మొగ్గలు ఉపయోగిస్తుంటారు. మరి పూజలో మొగ్గలను ఉపయోగించవచ్చునా? దీని గురించి పండితులు ఏం అంటున్నారో తెలుసుకుందాం.

1 / 5
హిందూ ధర్మంలో పూజ అంటే పూలు లేకుండా ఊహించలేం. ఏ పూజ అయినా, ఏ వ్రతం అయినా, దేవుడికి పూలు సమర్పించడం అనేది ముఖ్యమైన సంప్రదాయం. పూలు లేకుండా పూజ లేదు. మరీ  ముఖ్యంగా పండితులు పూజకు సువాసన కలిగిన పూలను ఉపయోగిస్తుంటారు. ఇక ఒక్కో దేవతకు ఒక్కో రకమైన పువ్వులు కూడా ఉపయోగిస్తుంటారు. కానీ కొందరు మొగ్గలు కూడా ఉపయోగిస్తుంటారు. అయితే ఇది శుభమా? అశుభమా అంటే?

2 / 5
 చాలా వరకు పూజకు మొగ్గలు ఉపయోగించకూడదు అని చెబుతున్నారు పండితులు. ఏ పూజలో అయినా సరే నిండుగా పూసిన పూలను మాత్రమే ఉపయోగిస్తారు. పూర్తిగా వికసించిన పూలను పూజకు ఉపయోగించడం వలన దాని అందం, సువాసన పెరుగుతుంది అంటారు. అందుకే వికసించిన పూలకే ఎక్కువ డిమాండ్ కూడా ఉంటుంది.

3 / 5
పూర్తిగా మొగ్గలను పూజకు ఉపయోగించలేం అని కూడా చెప్పలేం. ఎందుకు అంటే? కొంత మంది తమ సంప్రదాయాల ప్రకారం మొగ్గలతో మాల చేసి కూడా సమర్పిస్తారు. ముఖ్యంగా జాజి మల్లె వంటి వాటిని మొగ్గలను కూడా పూజలో ఉపయోగిస్తుంటారు. అందుకే కొన్నిరకాల పూజల్లో వీటిని కూడా ఉపయోగిస్తారు.

4 / 5
కానీ  కొన్ని నమ్మకాల ప్రకారం, విచ్చుకున్న పువ్వు పరిపూర్ణతకు, అందానికి, భక్తికి చిహ్నం. అందుకే దేవుడికి పూర్తిగా విచ్చిన పూలను సమర్పించడం శ్రేష్ఠమని భావిస్తారు. మరో నమ్మకం ప్రకారం, మొగ్గ ఇంకా విచ్చుకోవాల్సిన దశలో ఉంటుంది. దాన్ని చెట్టు నుండి కోసి పెట్టే బదులు, విచ్చిన పువ్వును సమర్పించడం మంచిదని చెబుతారు. అందుకే చాలా వరకు పూజల్లో పూర్తిగా వికసించిన పూలను మాత్రమే సమర్పిస్తారు.

5 / 5
ఇకవీలైనంత వరకు పూజకు తాజా, శుభ్రమైన పూలను మాత్రమే ఉపయోగించాలి. వాడిపోయిన పూలను వాడకూడదు. నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నట్ ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదని పాఠకులు గమనించి తీరాలి.

Loading...
Unable to load recommendations.
Follow Us