
మారేడు: మారేడు చెట్టు హిందూ సంస్కృతిలో చాలా పవిత్రమైనది. పూర్వీకులను పూజించేటప్పుడు దీని ఆకులను ఉపయోగిస్తారు. మారేడు ఆకుల్లో విటమిన్లు A, B, C పుష్కలంగా ఉంటాయి. ఇవి మంచి యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి.ఈ ఆకులు ఆస్తమా, అతిసారం వంటి సమస్యలకు సహాయపడతాయి. మారేడులో ఉండే టానిన్లు, ఫ్లేవనాయిడ్లు శరీరంలో మంటను తగ్గించగలవు. జ్యూక్‌గా, హెర్బల్ సప్లిమెంట్‌గా దీన్ని తీసుకోవచ్చు.

తులసి: ఇంటి ముంగిట తులసి ఉంటేనే ఆరోగ్యం ఉన్నట్లు. తులసి కేవలం సుగంధ మూలిక మాత్రమే కాదు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. పితృ పక్షంలో తులసి మొక్కలను నాటడం ఒక ఆచారం. తులసి ఆకులు, వేర్లు, విత్తనాల్లో మాంగనీస్, ఐరన్, విటమిన్లు A, K వంటి పోషకాలు ఉంటాయి. ఇవి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్‌లతో పోరాడే గుణాలను కలిగి ఉంటాయి. తులసిలో ఉండే అడాప్టోజెనిక్ గుణాలు ఒత్తిడి, ఆందోళన తగ్గించడంలో సహాయపడతాయి. తులసి టీ తాగడం లేదా వంటల్లో వాడటం ద్వారా సంప్రదాయాన్ని పాటిస్తూనే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

రావి చెట్టు: దీర్ఘాయుష్షుకు ప్రతీకగా భావించే రావి చెట్టు గాలిని శుభ్రపరుస్తుంది. దీని ఆకుల రసం దగ్గు, ఆస్తమా నుంచి ఉపశమనం ఇస్తుంది. బెరడు మధుమేహ నియంత్రణకు, ఎముకల బలానికి తోడ్పడుతుంది. అందువలన ఈ సమయంలో ఈ చెట్టును నాటడం మంచిది.

అశోక వృక్షం: పేరులోనే శోకాన్ని తొలగించే చెట్టు. ఆయుర్వేదంలో దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇది మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. అశోక చెట్టు అందమైన పువ్వులతో పాటు ఔషధ గుణాలను కూడా కలిగి ఉంది. ఆయుర్వేదంలో అశోక ఆకులు, పువ్వులను నొప్పి తగ్గించడానికి, రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రించడానికి ఉపయోగిస్తారు. అలాగే ఈ చెట్టు కిడ్నీలో రాళ్లను తొలగించడంలో కూడా సహాయపడుతుంది.

మర్రి చెట్టు: మన జాతీయ వృక్షం. దీనిలో విటమిన్ A, C, E ఉంటాయి. ఇది కంటి చూపును, జీర్ణశక్తిని మెరుగుపరిచి, దీర్ఘకాలిక ఆరోగ్యానికి దోహదపడుతుంది. ఒక మొక్క నాటడం ద్వారా మనం పూర్వీకులను స్మరించుకోవడమే కాదు, రాబోయే తరాలకు స్వచ్ఛమైన గాలిని, ఆరోగ్యాన్ని బహుమతిగా ఇచ్చినట్లు అవుతుంది.