
అక్టోబర్ నెలలో బుధుడు, శుక్రుడు, ఈ రెండు గ్రహాలు తుల రాశిలో సంచారం చేయనున్నాయి. ఈ రెండు గ్రహాల కలయికతో లక్ష్మీనారాయణ యోగం ఏర్పడనుంది. ఇక అక్టోబర్ 17న సూర్యుడు కూడా తుల రాశిలోకి సంచారం చేయడంతో మూడు గ్రహాల కలయికతో త్రిగ్రాహ రాజయోగం ఏర్పతుంది. ఇలా మూడు గ్రహాల కలయిక మూడు రాశుల వారికి లాభాలను తీసుకొస్తుందంట.

సింహ రాశి : వల్ల ఆర్థికంగా ఊహించని లాభాలు వస్తాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్, జీతం పెరుగుదలకు అవకాశం ఉంది. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు కలిసి వస్తాయి. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. కుటుంబంలో శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి.

కన్యా రాశి : కన్యా రాశి వారికి ఈ యోగం అదృష్టాన్ని తీసుకువస్తుంది. బుధుడు మీ రాశికి అధిపతి కావడంతో తులా రాశిలో జరిగే ఈ కలయిక మీకు ధన యోగాన్ని ఇస్తుంది. ఆకస్మిక ధన లాభం, పూర్వీకుల ఆస్తి నుంచి లాభం పొందే అవకాశం ఉంది. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయం లభిస్తుంది. వైవాహిక జీవితంలో ఆనందం, భార్యాభర్తల మధ్య అనుబంధం పెరుగుతుంది.

మకరరాశి : మకర రాశి వారికి అక్టోబర్ నెలలో రాజయోగం పట్టబోతోంది. త్రిగ్రాహి యోగం వల్ల మీ కెరీర్ లో పెద్ద మార్పు వస్తుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. విదేశాలకు వెళ్లాలనుకునే వారి కోరిక నెరవేరుతుంది. పెట్టుబడుల నుంచి మంచి రాబడి వస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

ఈ సమాచారం కేవలం మీ నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో పెట్టుకోని దీనిని అందంచడం జరిగింది.