
మకర రాశి : మకర రాశి వారు ఈ రోజుల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. డబ్బు విషయంలో తొందరపడి ఎవరికీ అప్పు ఇవ్వద్దు. ఉద్యోగంలో చిన్న తప్పు కూడా పెద్దగా కనిపించే అవకాశం ఉంది. వాహనం నడుపుతున్నప్పుడు, ప్రయాణాల్లో చాలా జాగ్రత్త అవసరం. కుటుంబంలో చిన్న విషయానికి గొడవలు రాకుండా మాటలు జాగ్రత్తగా మాట్లాడండి. శనివారం శనికి దీపం పెడితే మంచిది.

కన్యా రాశి : కన్యా రాశి వారికి ఈ సమయం కొంచెం ఒత్తిడిగా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్న సమయానికి కాకపోవచ్చు. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేయద్దు. ముఖ్యంగా కడుపు నొప్పి, జ్వరం లాంటివి వచ్చే అవకాశం ఉంది. ఎవరితోనూ అనవసర వాదనలకు దిగవద్దు. ఖర్చులు పెరిగిపోతాయి కాబట్టి డబ్బు జాగ్రత్తగా ఖర్చు చేయండి. బుధవారం గణపతికి పూజ చేస్తే మంచి జరుగుతుంది.

వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారికి అనుకోని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. నమ్మిన వారే మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది కాబట్టి, ఎవరినీ గుడ్డిగా నమ్మద్దు. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు చేసుకునే ముందు రెండు సార్లు ఆలోచించండి. ఇంట్లో పెద్దవారి ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి. కోపాన్ని తగ్గించుకుంటేనే చాలా సమస్యలు తగ్గుతాయి. మంగళవారం హనుమాన్ చాలీసా చదవడం మంచిది.

మేష రాశి : మేష రాశి వారు ఈ రోజుల్లో తొందరపాటు తగ్గించుకోవాలి. మీ వేగం, మీ కోపమే మీకు ఇబ్బంది తెచ్చిపెట్టవచ్చు. ఉద్యోగంలో పై అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. డబ్బు పెట్టుబడులు పెట్టేటప్పుడు తొందరపడవద్దు. ప్రయాణాల్లో జాగ్రత్త, వాహనాల విషయంలో నిర్లక్ష్యం వద్దు. కుటుంబంలో ప్రశాంతంగా ఉంటే అన్నీ సర్దుకుంటాయి. శుక్రవారం దుర్గమ్మకు పూజ చేస్తే దోషాలు తగ్గుతాయి.

ముఖ్య గమనిక : పై సమాచారం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదని పాఠకులు గమనించాలి. ఇది కేవలం రీడర్స్ ఆసక్తి మేరకు మాత్రమే ఇవ్వడం జరిగింది