
నవంబర్ 16న అనేక గ్రహాలు సంచారం చేశాయి.బుధుడు తుల రాశిలోకి సంచారం చేస్తాడు. అప్పటికే అదే రాశిలో సూర్యుడు ఉండటం వలన రెండు గ్రహాల కలయికతో బుధాదిత్య రాజయోగం ఏర్పడింది.ఈరోజే గురు మంగళ యోగం, లక్ష్మీనారాయణ యోగం ఏర్పడటం జరిగింది. దీని వలన సెప్టెంబర్ 17 నుంచి మూడు రాశుల వారికి ఊహించని ప్రయోజనాలు కలుగుతాయంట.

మీన రాశి : మీన రాశి వారికి నవంబర్ 17తర్వాత దశ పూర్తిగా తిరగనుంది. ఇప్పటివరకు ఆగిపోయిన పనులన్నీ ఒక్కొక్కటిగా పూర్తవుతాయి. డబ్బు విషయంలో మంచి శుభవార్త వింటారు. ఉద్యోగంలో మీ పనికి గుర్తింపు వస్తుంది. వ్యాపారం చేసేవారికి కొత్త కస్టమర్లు పెరుగుతారు. కుటుంబంలో సంతోషం, ప్రశాంతత వస్తుంది.

మేష రాశి : మేష రాశి వారికి ఇది బంగారు సమయం అని చెప్పవచ్చు. మీరు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అవకాశం మీ చేతికి వస్తుంది. ధన లాభం, కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి. మీ ధైర్యం, మీ మాటకు అందరూ విలువ ఇస్తారు. అప్పులు తీరిపోయి, చేతిలో డబ్బు నిలబడుతుంది. ప్రేమ, పెళ్లి విషయంలో కూడా మంచి శుభవార్త వింటారు.

కన్యా రాశి : కన్యా రాశి వారికి బుధాదిత్య యోగం అంటేనే అదృష్టం. ఎందుకంటే బుధుడు మీ రాశికి అధిపతి. ఈ యోగం వల్ల మీ తెలివితేటలు, మీ ఆలోచనలకు మంచి గుర్తింపు వస్తుంది. పరీక్షలు, ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. వ్యాపారంలో భారీ లాభం వస్తుంది. ఇంట్లో పెద్దల ఆశీర్వాదం, సమాజంలో మంచి పేరు వస్తుంది.

తుల రాశి :తుల రాశిలోనే ఈ యోగం ఏర్పడుతుంది కాబట్టి, మీకే అత్యధిక లాభం. మీ జీవితంలో ఇప్పటివరకు ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోతాయి. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ఉద్యోగంలో ప్రమోషన్, జీతం పెరిగే అవకాశం ఉంది. మీరు అనుకున్న ఇల్లు, వాహనం కొనే కల నెరవేరుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో ఇంట్లో ధనం, సంతోషం పెరుగుతాయి.