MLC Kavitha: కేసీఆర్ పుట్టిన రోజున తిరుపతిలో ఎమ్మెల్సీ కవిత.. వృద్ధాశ్రమంలో అన్నదానం.. శ్రీవారిని దర్శించుకున్న కవిత

| Edited By: Team Veegam

Feb 17, 2022 | 6:32 PM

MLC Kavitha: తిరుమల తిరుపతి(Tirumala Tirupati)లో కేసీఆర్ తనయ ఎమ్మెల్సీ కవిత సందడి చేశారు. తిరుపతిలోని మండలంలో రాస్ ఆధ్వర్యంలో నడుస్తున్న వృద్ధాశ్రమంలో కెసిఆర్ జన్మదిన వేడుకల్లో(KCR Birthday Celebrations) కవిత పాల్గొన్నారు.

1 / 5

తెలంగాణ వ్యాప్తంగా పండుగ వాతావరణంలో కెసిఆర్ పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నాయని కవిత చెప్పారు. కేసిఆర్ కు ప్రధాని మోది పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపడం సంతోషమని చెప్పారు. మధ్యాహ్నం తిరుపతి చేరుకున్న ఎమ్మెల్సీ కవితకు ఎయిర్ పోర్టులో ఆంధ్రప్రదేశ్ కు చెందిన సీఎం కేసీఆర్ అభిమానులు, మద్దతుదారులు ఘన స్వాగతం పలికారు. వారందరి సమక్షంలో కేక్ కట్ చేసి సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను నిర్వహించారు.

2 / 5
దేశరాజకీయాల్లోనూ టిఆర్ఎస్ చక్రం తిప్పుతుందన్నారు. 105స్థానాల్లో డిపాజిట్లు కూడా రానిబీజేపీ టిఆర్ఎస్ పై దుష్పచారం చేయడం హాస్యాస్పదమని..బీజేపీ ఎప్పుడో  తెలంగాణ ప్రజల విశ్వాసం కోల్పోయిందని ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యానించారు.

3 / 5
 కేసిఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని  తిరుపతి లోని ఓ వృద్ధాశ్రమాన్ని సందర్శించిన ఎమ్మెల్సీ కవిత, కాసేపు అక్కడివారితో ముచ్చటించారు. వృద్దులకు ఎమ్మెల్సీ కవిత అనిల్ దంపతులు స్వయంగా భోజనం వడ్డించారు. అనంతరం శ్రీవారి దర్శనం కోసం అలిపిరి పాదాల మండపం నుంచి కాలినడకన తిరుమల చేరుకున్నారు. అలిపిరి వద్ద తన భర్త అనిల్ తో కవిత కొబ్బరి కాయలు కొట్టి  శ్రీవారికి మొక్కులు తీర్చుకున్నారు.

4 / 5
తిరుమల శ్రీవారిని దర్సించుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నానని.. తెలంగాణ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థిస్తానని చెప్పారు. అలిపిరి వద్ద వాతావరణం ఆహ్లాదకరంగా ఉందన్నారు.

5 / 5
పాదాల మండపం వద్దకు చేరుకోగానే మనస్సు భక్తిభావంతో నిండిపోయిందన్నారు కవిత. అలిపిరి వద్దనున్న సప్తగోప్రదక్షిణ మందిరాన్ని  కవిత అనిల్ దంపతులు దర్శించుకున్నారు. అనంతరం కవిత, అనిల్ దంపతులు  గో పూజ చేశారు. శ్రీక్రిష్ణునికి ప్రత్యేక పూజలను నిర్వహించారు.  సాయంత్రానికి కొండ మీదకు చేరుకున్న ఎమ్మెల్సీ కవిత, వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. సీఎం కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎం కేసీఆర్ గారు ఆయురారోగ్యాలతో, నిరంతరం ప్రజాసేవకు పాటుపడాలని ఎమ్మెల్సీ కవిత భగవంతుని ప్రార్థించారు.రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సుభిక్షంగా ఉండాలని, ఇద్దరు ముఖ్యమంత్రులు ఆయురారోగ్యాలతో ఉండాలని వేంకటేశ్వరస్వామిని వేడుకున్నారు ఎమ్మెల్సీ కవిత.