
జ్యోతిష్య శాస్త్రంలో బుధ గ్రహానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అయితే వచ్చే నెలలో డిసెంబర్ 2న బుధుడు రాశి సంచారం చేయనున్నాడు. బుధుడు వృశ్చిక రాశిలోకి సంచారం చేయడం వలన నాలుగు రాశుల వారికి పట్టింది బంగారమే కానుంది ఆ రాశులు ఏవో చూసేద్దాం.

మిథున రాశి :మిథున రాశికి బుధుడే అధిపతి కాబట్టి, ఈ సంచారం మీకు డబుల్ లాభాన్ని ఇస్తుంది. మీ తెలివితేటలకు అందరూ ఫిదా అవుతారు. చదువుకునే విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగంలో మీ పనితీరుకు మంచి గుర్తింపు లభిస్తుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. మీరు అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తవుతాయి.

కన్యా రాశి :కన్యా రాశి వారికి కూడా బుధుడు అధిపతి. అందుకే ఈ సంచారం మీకు అత్యంత శుభప్రదంగా ఉంటుంది. మీరు ఎంతో కాలంగా కష్టపడుతున్న పనులకు ఇప్పుడు ఫలితం దక్కుతుంది. వ్యాపారంలో భారీ లాభాలు వస్తాయి. ఉద్యోగస్తులకు జీతం పెరిగే అవకాశం ఉంది. మీ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. మీ చుట్టూ ఉన్నవారి నుండి మంచి సపోర్ట్ లభిస్తుంది. ఏ పని మొదలుపెట్టినా విజయవంతంగా పూర్తి చేస్తారు.

తుల రాశి :తుల రాశి వారికి ఇక బంగారు రోజులు మొదలైనట్లే. చాలా కాలంగా వేధిస్తున్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. అనుకోని ధనలాభం కలిగే అవకాశం ఉంది. ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి శుభవార్త వింటారు. భార్యాభర్తల మధ్య ఉన్న చిన్న చిన్న గొడవలు తగ్గి, అన్యోన్యత పెరుగుతుంది. మీరు చేసే ప్రతి ప్రయత్నంలో విజయం మీ సొంతమవుతుంది.

మేష రాశి : మేష రాశి వారికి ఈ బుధ సంచారం అదృష్టాన్ని తీసుకురాబోతుంది. ఇప్పటివరకు పడిన కష్టాలన్నీ ఒక్కొక్కటిగా తీరిపోతాయి. ఉద్యోగంలో ఎదురుచూస్తున్న ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. ఆర్థికంగా కూడా మంచి లాభాలు కనిపిస్తున్నాయి. ఆగిపోయిన డబ్బులు చేతికి అందుతాయి. వ్యాపారం చేసేవారికి కొత్త ఒప్పందాలు కుదురుతాయి. కుటుంబంలో సంతోషం పెరుగుతుంది. మీ మాటకి ఇప్పుడు విలువ పెరుగుతుంది.