
మేష రాశి : మేష రాశి వారికి భద్ర రాజయోగం, బుధుడి సంచారం వలన అద్భుతమైన ఫలితాలను తీసుకొస్తుంది. వీరు సమయంలో అనుకున్న పనులు అన్నీ కూడా పూర్తి చేసుకుంటారు. ఆదాయం పెరుగుతుంది. విద్యార్థులు మంచి ర్యాంకులతో పాస్ అవుతారు. అంతే కాకుండా అత్త మామల నుంచి రావాల్సిన వారసత్వ ఆస్తి దక్కుతుంది. పేదరికం పోయి చాలా ఆనందంగా గడుపుతారు. సూర్యుడి ప్రత్యేక ఆశీస్సులు ఈ రాశి వారిపై ఉంటాయి.

కర్కాటక రాశి : కర్కాటక రాశి వారికి ఆరోగ్యం బాగుంటుంది. గత కొన్ని రోజుల నుంచి ఎవరు అయితే అనారోగ్య సమస్యలతో సతమతం అయ్యారో, వారు వాటి నుంచి బయటపడతారు. అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు అంతే కాకుండా చేయాలి అనుకున్న పనులను చాలా వేగంగా పూర్తి చేస్తారు. జ చాలా ఆనందంగా గడుపుతారు. అన్నివిధాలుగా మీకు కలిసి వస్తుంది. ఆర్థికంగా బాగుంటుంది.

మీన రాశి : మీన రాశి వారు ప్రభుత్వ ఉద్యోగం పొందే ఛాన్స్ ఎక్కువగా ఉంది. అంతే కాకుండా తల్లిదండ్రుల నుంచి ఆర్థిక సలహాసహకారాలు లభిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం. వ్యాపారల్లో ఎక్కువ లాభాలు అందుకుంటారు. ముఖ్యంగా ఈ రాశి వారికి భాగస్వామ్య వ్యాపారం కలిసి వస్తుంది.

వృషభ రాశి : వృషభ రాశి వారికి భద్ర రాజయోగం వలన చాలా అద్భుతంగా కలిసి రానున్నది. వీరికి అప్పుల బాధలు తొలిగిపోతాయి. ఇంట్లో ధన వర్షం కురుస్తుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇవి మీకు మంచి లాభాలను తీసుకొస్తాయి. ఆర్థికంగా, ఆరోగ్య పరంగా అన్ని విధాలుగా కలిసి వస్తుంది.

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు