
జ్యోతిషశాస్త్రంలో కుజుడిని గ్రహాల సేనాధిపతిగా పరిగణిస్తారు. ధైర్యసాహసాలు, ఆత్మవిశ్వాసం, భూమి, ఆస్తులు, సోదరులకు కుజుడు కారకుడిగా చెబుతారు. కుజుడి రాశి మార్పు వ్యక్తుల జీవితాల్లో కీలక మార్పులకు కారణమవుతుందని జ్యోతిష్య నిపుణులు భావిస్తారు. 2026 నవంబర్ 12న కుజుడు ప్రస్తుత కర్కాటక రాశి నుంచి సింహ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అక్కడ సుమారు 118 రోజుల పాటు.. అంటే 10 మార్చి 2027 వరకు (మధ్యలో వక్రగతి సంచారం ఉంటుంది) కొనసాగుతాడు. సూర్యుడికి చెందిన సింహ రాశిలోకి కుజుడు ప్రవేశించడం వల్ల ఆత్మవిశ్వాసం, కార్యదక్షత పెరుగుతాయని భావిస్తారు. ఈ సంచారం వల్ల ఐదు రాశుల వారికి ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక విషయాల్లో మంచి ప్రయోజనాలు కలగనున్నాయని జ్యోతిష్య పండితులు అంచనా వేస్తున్నారు. మేషం, మిథునం, సింహం, వృశ్చికం, ధనుస్సు రాశుల వారికి విశేష ప్రయోజనాలు కలిగే అవకాశముంది.

మేష రాశి (Aries): కుజుడి సంచారం మేష రాశి వారికి మంచి పురోగతిని అందించే అవకాశం ఉంది. చేపట్టిన పనులు అనుకున్న దిశలో ముందుకు సాగుతాయి. వ్యాపారస్తులకు తమ వ్యాపారాన్ని విస్తరించుకునే అవకాశాలు లభిస్తాయి. కొత్త ఒప్పందాలు కుదిరే సూచనలు ఉన్నాయి. గతంలో చేసిన పెట్టుబడుల నుంచి లాభాలు పొందుతారు. ఏదైనా శుభవార్త వినే అవకాశం ఉంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపార రంగాల్లో కొత్త పరిచయాలు ప్రయోజనకరంగా మారుతాయి.

మిథున రాశి (Gemini): ఈ రాశి వారికి కుజుడి సంచారం ధైర్యం, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఏ పని చేపట్టినా పట్టుదలతో పూర్తి చేయగలుగుతారు. చాలాకాలంగా నిలిచిపోయిన పనులు మళ్లీ ప్రారంభమవుతాయి. ఉద్యోగంలో పురోగతి సాధించే అవకాశాలు ఉన్నాయి. కెరీర్లో మంచి మార్పులు చోటు చేసుకునే అవకాశముంది. కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంటుంది. ఇంట్లో సుఖసంతోషాలు పెరుగుతాయి. విలాసవంతమైన వస్తువుల కొనుగోలుకు ఖర్చు చేసే సూచనలు ఉన్నాయి.

సింహ రాశి (Leo): కుజుడు సింహ రాశిలోనే సంచరించడంతో ఈ రాశి వారికి ప్రత్యేక ప్రయోజనాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలను ఖరారు చేసుకునే అవకాశం ఉంది. ఉద్యోగంలో మంచి పురోగతి కనిపిస్తుంది. ఆత్మవిశ్వాసం పెరగడంతో కష్టమైన పనులను కూడా సులభంగా పూర్తి చేయగలుగుతారు. వైవాహిక జీవితంలో అనుబంధం బలపడుతుంది. జీవిత భాగస్వామితో సంబంధాలు మెరుగుపడతాయి. పని చేసే విధానంలో మార్పులు తీసుకురావడం వల్ల ఇతరుల ప్రశంసలు లభిస్తాయి.

వృశ్చిక రాశి (Scorpio): ఈ రాశి వారికి కుజుడి సంచారం కొత్త ఉత్సాహాన్ని తీసుకొస్తుంది. శారీరకంగా, మానసికంగా చురుకుదనం పెరుగుతుంది. గతంలో రిస్క్ తీసుకోవడానికి భయపడిన పనులను ఇప్పుడు ధైర్యంగా చేపడతారు. చాలాకాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. ఆదాయానికి కొత్త మార్గాలు ఏర్పడుతాయి. వ్యాపారంలో లాభాలు పొందే సూచనలు ఉన్నాయి. గతంలో చేసిన పెట్టుబడుల నుంచి ప్రయోజనాలు కలుగుతాయి. కెరీర్లో పురోగతి సాధిస్తారు.

ధనుస్సు రాశి (Sagittarius): ఈ రాశి వారికి కుజుడి సంచారం ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ఆదాయ మార్గాలు పెరిగే అవకాశం ఉంది. చాలాకాలంగా ఎదురుచూస్తున్న ఆర్థిక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. కోర్టు వ్యవహారాల్లో అనుకూల పరిణామాలు చోటుచేసుకునే సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. విద్యార్థులకు ఈ సమయం ప్రయోజనకరంగా ఉంటుంది. చదువులో మంచి ఫలితాలు సాధించేందుకు అవకాశాలు ఉన్నాయి. వృత్తి, వ్యాపారాల్లో కొత్త ప్రణాళికలు విజయవంతమయ్యే సూచనలు ఉన్నాయి. (గమనిక: ఇవి జ్యోతిషశాస్త్ర అంచనాల ఆధారంగా అందించిన సాధారణ ఫలితాలు మాత్రమే. వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఫలితాలు మారే అవకాశం ఉంటుంది)