
అయితే మరి వాస్తు ప్రకారం ఇంటి ముందు బంతి మొక్కలు నాటుకోవడం మంచిదేనా? దీని గురించి వాస్తు శాస్త్ర నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. హిందూ మతంలో బంతి పూలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతి శుభకార్యంలో వీటిని ఉపయోగిస్తుంటారు. అంతే కాకుండా వీటిని ఇంటి గుమ్మానికి కట్టడం వలన ఇంటిలో సానుకూల వాతావరణం నింపుతుంది అంటారు.

అందువలన ఇంటిలో ఈ మొక్కలు నాటుకోవడం కూడా చాలా శుభప్రదమంట. ముఖ్యంగా విష్ణుమూర్తికి , లక్ష్మీదేవికి బంతి పూల మొక్క అంటే చాలా ఇష్టం. బంతి పూలు పూజలో ఉన్నా లేదా మాలగా అమ్మవారికి సమర్పించినా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందంట. అంతే కాకుండా బంతి పూల మొక్కలు ఇంటిలో ఉన్నా చాలా మంచిదంట.

ఇంటి ముందు బంతి పూల మొక్క ఉండటం వలన ఇంటిలో సానుకూలత పెరుగుతుంది. అంతే కాకుండా ఆర్థికంగా , ఆరోగ్య పరంగా కూడా చాలా అద్భుతంగా కలిసి వస్తుందంట. చాలా మంది వాస్తు దోషాలతో అనేక సమస్యలు ఎదుర్కుంటారు. అలాంటి వారు ఇంటి మందు బంతి మొక్క నాటుకోవడం చాలా శుభప్రదంట.

అయితే మొక్క నాటుకునే దిశ ఎప్పుడూ కూడా సరైనదిగా ఉండాలి. ఎవరు అయితే తమ ఇంటికి ఈశాన్యంలో బంతి పూల మొక్కు నాటుకుంటారో వారికి అన్నివిధాలుగా కలిసి వస్తుంది. ఇది చాలా శుభప్రదం. అలాగే ఇది ఇంటి వద్ద ఉండటం వలన మంచి సువాసన, పరిసరాలను శుద్ధి చేయడమే కాకుండా, కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, సంతోషాన్ని నింపుతుందంట.

ఇక ఎవరు అయితే తమ ఇంటి ప్రధాన ద్వారానికి బంతి పూలను అలంకరిస్తారో వారి ఇంటిలో సానుకూలత పెరగడమే కాకుండా, ప్రతి కూలశక్తి ఇంటిలోకి రాకుండా అడ్డుకుంటుంది. ఇక ఎప్పుడూ కూడా బంతి మొక్కలను ఇంటిలో దక్షిణం లేదా పడమర దిశలో నాటకూడదు, ఇది చాలా అశుభకరం. నోట్ : పై సమాచారం కేవలం పండితులు, ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.