
2026 మార్చి3 మంగళ వారం రోజు చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఇది భారత దేశంలో కనిపిస్తుంది. సూతక కాలం చెల్లుతుంది కాబట్టి, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తప్పకుండా ఈ సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతారు పండితులు. ముఖ్యంగా ఇది మూడు రాశులపై దాని చెడు ప్రభావం చూపెట్టనున్నదంట. కాగా, ఏ రాశుల వారికి చెడు ఫలితాలను ఇస్తుందో ఇప్పుడు చూద్దాం.

సింహ రాశి : సింహ రాశి వారిపై చంద్రగ్రహణం చెడు ప్రభావం చూపుతుంది. ఈ రాశి వారు ఆర్థిక సమస్యలు ఎదుర్కుంటారు. ఈ సమయంలో ఏదైనా కొత్తపని ప్రారంభించడం అస్సలే చేయకూడదు. మానసిక ఒత్తిడి అధికం అవుతుంది. పనుల్లో ఆటంకాలు కలుగుతాయి. మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది.

కన్యా రాశి : మార్చి 3 మంగళ వారం ఏర్పడే చంద్రగ్రహణం కన్యా రాశి వారికి చెడు ఫలితాలను ఇస్తుంది. వారు మానసికంగా అనేక సమస్యలను ఎదుర్కుంటారు. ఆర్థికంగా నష్టపోతారు. కుటుంబంలో కలహాలు మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తాయి.

కుంభ రాశి : కుంభ రాశి వారు గ్రహణం సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆర్థికంగా నష్టపోయే ఛాన్స్ ఉంది. అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయి. ఉద్యోగులకు ఒత్తిడి అధికం అవుతుంది. ఆర్థికంగా, ఆరోగ్యంగా చాలా నష్టపోతారు.

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు