Astrology: అరుదైన యోగం.. ఈ 4 రాశులపై కనకవర్షమే.. ఐశ్వర్యం, ఆనందం వీరి వెంటే!

Updated on: Sep 18, 2026 | 4:12 PM

Mercury-Venus Conjunction-Lakshminarayana Yoga Telugu: సెప్టెంబర్ నెలాఖరులో తులారాశిలో బుధుడు, శుక్రుడి కలయికతో లక్ష్మీనారాయణ యోగం ఏర్పడనుందని జ్యోతిష్య అంచనాలు చెబుతున్నాయి. ఈ యోగ ప్రభావంతో నాలుగు రాశుల వారికి ఆర్థిక లాభాలు, ఉద్యోగ అవకాశాలు, వ్యాపార పురోగతి, కుటుంబ సంతోషం కలగవచ్చని భావిస్తున్నారు.

1 / 5
Mercury-Venus Conjunction-Lakshminarayana Yoga Telugu: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం, వాటి పరస్పర కలయికలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉందని జ్యోతిష్యులు చెబుతారు. ముఖ్యంగా శుభ గ్రహాలైన బుధుడు, శుక్రుడు ఒకే రాశిలో కలిసినప్పుడు లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతుందని జ్యోతిష్య సంప్రదాయంలో భావిస్తారు. ఈ యోగం సంపద, వ్యాపారం, తెలివితేటలు, సౌఖ్యం వంటి అంశాలకు అనుకూల ఫలితాలను అందిస్తుందని నమ్మకం. సెప్టెంబర్ నెలాఖరులో పితృ పక్షాలు ప్రారంభమయ్యే ముందు, శుక్రుడు తన సొంత రాశి అయిన తులారాశిలోకి ప్రవేశించనున్నాడు. అప్పటికే అదే రాశిలో బుధుడు ఉండటంతో వీరిద్దరి కలయిక వల్ల లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతుందని జ్యోతిష్య అంచనాలు చెబుతున్నాయి. ఈ యోగ ప్రభావం కొన్ని రాశుల వారికి ఆర్థికంగా, వృత్తిపరంగా, కుటుంబ పరంగా అనుకూల ఫలితాలను తీసుకురావచ్చని భావిస్తారు. ముఖ్యంగా నాలుగు రాశుల వారికి ఈ సమయం ప్రత్యేకంగా ఉండనుంది.

2 / 5
మిథున రాశి.. లక్ష్మీనారాయణ యోగం మిథున రాశి వారికి ఆర్థికంగా అనుకూల పరిస్థితులను తీసుకురావచ్చని జ్యోతిష్యులు చెబుతున్నారు. గతంలో చేసిన పెట్టుబడుల నుంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. చాలాకాలంగా వాయిదా పడుతున్న పనులు ముందుకు సాగవచ్చు. పిల్లల చదువు లేదా పురోగతికి సంబంధించిన శుభవార్తలు కుటుంబంలో ఆనందాన్ని నింపవచ్చు. స్టాక్ మార్కెట్, మీడియా, కమ్యూనికేషన్ రంగాల్లో ఉన్నవారికి కొత్త అవకాశాలు లభించే సూచనలు ఉన్నాయి.

3 / 5
తులా రాశి.. ఈ యోగం తులారాశిలోనే ఏర్పడటం వల్ల ఈ రాశి వారికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుందని జ్యోతిష్య సంప్రదాయం చెబుతోంది. వ్యాపారులకు కొత్త అవకాశాలు, లాభాలు రావచ్చు. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పరిష్కారం కావచ్చు. విదేశీ ఉద్యోగాలు, ప్రయాణాలు లేదా ప్రాజెక్టుల కోసం ప్రయత్నిస్తున్న వారికి అనుకూల పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆత్మవిశ్వాసం పెరిగి కొత్త నిర్ణయాలు తీసుకునే ధైర్యం రావచ్చు.

4 / 5
ధనుస్సు రాశి.. ఈ యోగం వల్ల ఆదాయ మార్గాలు పెరిగే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు, ప్రమోషన్ లేదా కెరీర్‌లో మార్పులు రావచ్చు. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న యువతకు మంచి అవకాశాలు లభించవచ్చు. ఆదాయం పెరగడంతో పాటు సౌకర్యాల కోసం ఖర్చు చేసే అవకాశం కూడా ఉంటుంది. అయినప్పటికీ ఆర్థిక స్థిరత్వం మెరుగుపడవచ్చని జ్యోతిష్య అంచనాలు సూచిస్తున్నాయి.

5 / 5
కుంభ రాశి.. కుంభ రాశి వారికి సృజనాత్మకత, కళలు, మీడియా, మార్కెటింగ్ వంటి రంగాల్లో మంచి అవకాశాలు లభించవచ్చు. తమ ప్రతిభకు గుర్తింపు రావడంతో పాటు కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు అదనపు లాభాలు రావచ్చు. వైవాహిక జీవితంలో భాగస్వామితో అనుబంధం మరింత బలపడే అవకాశం ఉందని జ్యోతిష్యులు చెబుతున్నారు. 
(Disclaimer: ఈ కథనంలోని వివరాలు జ్యోతిష్య సంప్రదాయాలు, నమ్మకాల ఆధారంగా చెప్పబడిన ఫలితాలు మాత్రమే. వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఫలితాల్లో మార్పులు ఉండవచ్చు. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునేముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)

కుంభ రాశి.. కుంభ రాశి వారికి సృజనాత్మకత, కళలు, మీడియా, మార్కెటింగ్ వంటి రంగాల్లో మంచి అవకాశాలు లభించవచ్చు. తమ ప్రతిభకు గుర్తింపు రావడంతో పాటు కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు అదనపు లాభాలు రావచ్చు. వైవాహిక జీవితంలో భాగస్వామితో అనుబంధం మరింత బలపడే అవకాశం ఉందని జ్యోతిష్యులు చెబుతున్నారు. (Disclaimer: ఈ కథనంలోని వివరాలు జ్యోతిష్య సంప్రదాయాలు, నమ్మకాల ఆధారంగా చెప్పబడిన ఫలితాలు మాత్రమే. వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఫలితాల్లో మార్పులు ఉండవచ్చు. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునేముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)

Loading...
Unable to load recommendations.
Follow Us