
అయితే అతి త్వరలో, కుజ గ్రహం, సూర్యుడు సెప్టెంబర్ 15న ఒకదానికి ఒకటి 60 డిగ్రీల కోణంలో రాబోతున్నాయి. ఇలా రెండు గ్రహాలు దగ్గరగా రావడం వలన లాభదృష్టి యోగం ఏర్పడుతుంది. అయితే ఇది పన్నెండు రాశులపై ప్రభావం చూపగా, మూడు రాశుల వారికి మాత్రం ఊహించని విధంగా ప్రయోజనాలు చేకూర్చనుంది. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

మేష రాశి : మేష రాశి వారికి లాభదృష్టి యోగం వలన అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. వీరు గత కొన్ని రోజుల నుంచి పడుతున్న బాధల నుంచి విముక్తి పొందుతారు. ఆరోగ్యం కూడా కుదుట పడుతుంది. ఆదాయం పెరుగుతుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. అన్ని విధాలుగా కలిసి వస్తుంది.

కన్యా రాశి : కన్యా రాశి వారికి ఇది చాలా మంచి సమయం. దూర ప్రయాణాలు చాలా లాభదాయకంగా ఉంటాయి. ముఖ్యంగా రియలెస్టేట్ రంగంలో ఉన్నవారు ఎక్కువ లాభాలను అందుకుంటారు. ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. అన్ని విధాలుగా మీకు ఈ సమయం అద్భుతంగా కలిసి వస్తుందని చెప్పాలి.

తుల రాశి : తుల రాశి వారికి ఇది అద్భుతమైన సమయంగా చెప్పాలి. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. ఈ రాశి వారికి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అంతే కాకుండా డబ్బు పరంగా కలిసి వస్తుంది. చాలా రోజుల నుంచి మంచి ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి కూడా ఇది చాలా అద్భుతమైన సమయం.

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు