
జ్యోతిష్య ప్రకారం గ్రహాల కదికలతో కొన్ని యోగాలు ఏర్పడతాయి. ఇప్పుడు గురు గ్రహంపై రాహువు దృష్టి పడటం వల్ల కొన్ని రాశుల వారికి అనుకోని శుభ ఫలితాలు కలగనున్నాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ముఖ్యంగా జూన్ 3 వరకు ఈ ప్రభావం కొనసాగుతూ.. ఆరు రాశులకు విపరీత రాజయోగం, కుబేర యోగం వంటి శుభయోగాలు ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పుడు ఆ అదృష్ట రాశులు ఏవో, వాటికి కలిగే ప్రయోజనాలు ఏమిటో చూద్దాం.

మేష రాశి.. ఈ రాశివారికి గురు-రాహు ప్రభావం శుభస్థానంలో ఉండటం వల్ల మంచి అవకాశాలు వస్తాయి. ఉన్నత విద్య, విదేశీ ఉద్యోగం, కొత్త వ్యాపారాల ప్రారంభానికి ఇది అనుకూల సమయం. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు రావచ్చు. వృత్తి, వ్యాపారాల్లో ఎదిగి ఆర్థికంగా బలపడే అవకాశం ఉంది.

వృషభ రాశి.. వృషభ రాశివారికి ఈ కాలం అనుకూలంగా మారుతుంది. విదేశీ ఆదాయం కలిసొచ్చే అవకాశాలు ఎక్కువ. చిన్న ప్రయత్నంతోనే మంచి ఫలితాలు పొందగలరు. ఆకస్మిక ధనలాభం కలగవచ్చు. ఏ పని చేసినా విజయవంతం అయ్యే సూచనలు ఉన్నాయి.

మిథున రాశి.. ఈ రాశివారికి విదేశీ ప్రయాణాలు, విదేశీ ఆదాయం ఖాయం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఉన్నత విద్యకు మంచి అవకాశాలు వస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్ లభించవచ్చు. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడి లాభాలు కలుగుతాయి.

తులా రాశి.. తులా రాశివారికి తక్కువ శ్రమతోనే మంచి అవకాశాలు లభించే సమయం ఇది. విదేశీ ఉద్యోగం లేదా వ్యాపార ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. వివాహ ప్రయత్నాల్లో విదేశీ సంబంధం ఏర్పడవచ్చు. ఆర్థికంగా గణనీయమైన లాభాలు పొందే అవకాశం ఉంది.

ధనుస్సు రాశి.. ఈ రాశివారు ఉన్నత విద్య లేదా శిక్షణ కోసం విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. ఉద్యోగ, వ్యాపారాల్లో అరుదైన అవకాశాలు వస్తాయి. షేర్లు, పెట్టుబడుల ద్వారా లాభాలు పొందవచ్చు. ఆదాయాన్ని పెంచుకునే కొత్త మార్గాలు కనిపిస్తాయి.

మీన రాశి.. మీన రాశివారికి ఈ కాలం చాలా అనుకూలం. విదేశాల్లో స్థిరపడే అవకాశాలు ఉన్నాయి. ఆదాయం పెరిగి ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. జీతం, ఇతర లాభాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి ద్వారా కూడా సంపద కలగవచ్చు. వివాహంలో విదేశీ సంబంధం ఏర్పడే సూచనలు ఉన్నాయి. (Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిషం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)