
అయితే ప్రస్తుతం కేతు గ్రహం సింహ రాశిలో సంచరిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సమయంలో ఇది నాలుగు రాశులపై తన దృష్టి కేంద్రీకరించడం, నాలుగు రాశులపై అనుగ్రహం కలిగించడం వలన ఆ రాశుల వారికి ఊహించని ప్రయోజనాలు కలగనున్నాయి అంట. ముఖ్యంగా తప్పకుండా ఫ్లాట్ కొనుగోలు చేయడం లేదా వాహన యోగం ఉందని చెబుతున్నారు పండితులు. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు మనం చూసేద్దాం.

మేష రాశి : మేష రాశి వారికి కేతువు అనుగ్రహం వలన చాలా అద్భుతంగా కలిసి వస్తుంది. పనుల్లో ఆటంకాలు తొలిగిపోతాయి. అంతే కాకుండా ఈ రాశి వారు ఊహించని విధంగా లాభాలు అందుకుంటారు. ఉద్యోగం చేసే చోట కూడా మీకు మంచి గౌరవం లభిస్తుంది. మీ పనికి తగిన గుర్తింపు లభించడంతో చాలా ఆనందంగా గడుపుతారు.

మిథున రాశి : మిథున రాశి వారికి కేతువు సానుకూల దృష్టి వలన చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా ఎవరు అయితే చాలా రోజుల నుంచి ఫ్లాట్, ల్యాండ్ తీసుకోవాలని చూస్తున్నారో, వారి కోరిక నెరవేరుతుంది. అంతే కాకుండా ఆర్థికంగా కలిసి వస్తుంది. చేతినిండా డబ్బుతో చాలా ఆనందంగా గడుపుతారు. అన్ని విధాలుగా ఈ రాశి వారికి కలిసి వస్తుంది.

తుల రాశి : తుల రాశి వారికి ఇది చాలా బెస్ట్ సమయం. వీరు అనుకున్న సమయానికి పనులు పూర్తి చేసుకుంటారు. చాలా ఆనందంగా గడుపుతారు. విద్యార్థులు మంచి కాలేజీల్లో సీటు సంపాదించుకుంటారు. ఆర్థికంగా, ఆరోగ్య పరంగా కలిసి వస్తుంది. ఈ రాశి వారు నూతన వాహన కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకుంటుంది.

సింహ రాశి : సింహ రాశి వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. సమయానికి డబ్బు చేతికి అందుతుంది. చాలా రోజుల నుంచి విదేశీ పర్యాటన చేయాలి అనుకునే వారికి ఇది మంచి సమయం. అలాగే వ్యాపారస్తులు ఎక్కువ లాభాలు అందుకుంటారు. చాలా ఆనందంగా గడుపుతారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది.