
గ్రహాలు నక్షత్ర సంచారం, రాశి సంచారం చేస్తుంటాయి. అయితే నవ గ్రహాల్లో కేతు గ్రహం నీడ గ్రహం, నీచ గ్రహం అని అంటారు. ఎందుకంటే దీని వలన చాలా వరకు సమస్యలు మాత్రమే ఎదురు అవుతాయి. అందుకే చాలా మంది తమ జాతకంలో కేతువు శుభ స్థానంలో ఉండాలి అని కోరుకుంటారు. ఇక కేతు గ్రహం రాశి సంచారమే కాకుండా, నక్షత్ర సంచారం కూడా చేస్తుంది. అయితే త్వరలో ఆగస్టు 2 మాఘ నక్షత్రంలోకి సంచారం చేయనుంది. దీని వలన నాలుగు రాశుల వారికి కలిసి వస్తుంది.

ధనస్సు రాశి : ధనస్సు రాశి వారికి కేతు గ్రహం నక్షత్ర సంచారం వలన ఆగస్టు నెల మొత్తం చాలా అద్భుతంగా కలిసి వస్తుంది. కష్టానికి తగిన ప్రతి ఫలం లభిస్తుంది. చాలా రోజుల నుంచి మంచి ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి త్వరలో జాబ్ దొరుకుతుంది. విద్యార్థులు మంచి కాలేజీల్లో సీటు సంపాదించుకుంటారు. పనుల్లో ఆటంకాలు తొలిగిపోతాయి. అన్నింట్లో పురోగతి లభిస్తుంది.

మేష రాశి : మేష రాశి వారికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఎవరు అయితే చాలా రోజుల నుంచి కోర్టు సంబంధ సమస్యలతో సతమతం అవుతున్నారో, వారు వాటి నుంచి బయటపడతారు. కోర్టు సంబంధ వ్యవహారాలు మీకు అనుకూలంగా వస్తాయి.

సింహ రాశి : సింహరాశి వారికి అద్భుతంగా కలిసి రానుంది. వీరికి వ్యాపారంలో అద్భుతంగా ఉండనుంది. చాలా రోజుల నుంచి భాగస్వామ్య వ్యాపారం ఎవరు ప్రారంభించాలి అనుకుంటారో వారికి కలిసి వస్తుంది. అన్ని విధాలుగా వీరికి కలిసి రానుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది.

మీన రాశి : మీన రాశి వారికి కూడా చాలా అద్భుతంగా కలిసి వస్తుంది. ఆగస్టు నుంచి పట్టింది బంగారమే కానుంది. పనుల్లో ఆటంకాలు తొలిగిపోయి, చాలా ఆనందంగా జీవిస్తారంట. నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్, నిపుణుల ఆధారంగా ఇవ్వడం జరుగుతుంది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించరు.