
కార్తీక మాసంలో అనేక గ్రహాల సంచారం కదలికలు జరగనున్నాయి. అంతే కాకుండా శివుడి అనుగ్రహం కూడా కలగనుంది. అయితే ఇప్పుడు మనం ఈ మాసంలో ఏ రాశుల వారికి శివుడి అనుగ్రహం ఉండనుంది? దీని వలన ఎవరికి కలిసి వస్తుందో ఇప్పుడు మనం చూసేద్దాం.

కుంభ రాశి : కుంభ రాశి వారికి మానసిక ప్రశాంతత కలుగుతుంది. సమాజంలో వీరిదే పై చేయి అవుతుంది. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కానీ ఇది మీకు ఊహ కందని లాభాలను తీసుకొస్తుంది. కళా రంగంలో ఉన్నవారు అవార్డులు అందుకుంటారు. ఆదాయం పెరుగుతుంది. అప్పులు తీరిపోతాయి. అనుకున్న కోరికలు నెరవేర్చుకుంటారు.

మకర రాశి : మకర రాశి వారికి పట్టింది బంగారమే అవుతుంది. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారస్తులకు చాలా అద్భుతమైన సమయం. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఎక్కువ మొత్తంలో లాభాలు అందుకుంటారు. దూర ప్రయాణాలు చాలా లాభదాయకంగా ఉంటాయి. ప్రతి పనిలో విజయం వీరిదే అవుతుంది.

తుల రాశి : తుల రాశి వారికి ఇది చాలా కలిసి వచ్చే సమయం. చాలా రోజుల నుంచి ఎవరు అయితే వివాహం నిశ్చయం కోసం ఎదురు చూస్తారో వారికి ఇది మంచి సమయం. పెళ్లి నిశ్చయం అవుతుంది. ఆర్థికంగా కలిసి వస్తుంది. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ప్రతి పనిలో విజయం మీదే అవుతుంది.

కన్యా రాశి : కన్యా రాశి వారికి కార్తీక మాసం చాలా అద్భుతంగా ఉంటుంది. వీరికి ఆర్థికంగా కలిసి వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. అంతే కాకుండా శివుడి అనుగ్రహం వలన ఏ రాశుల వారు అయితే జీవితంలో గొప్పగా జీవించాలి అనుకుంటారో వారికి ఇది చాలా అద్భుతమైన సమయం అని చెప్పాలి.