
రేగు పండ్లు ఆరోగ్యానికి చాలా మంచిది. చాలా మంది వీటిని ఎక్కువగా తినడానికి ఆసక్తి చూపిస్తుంటారు. వీటిలో విటమిన్ సి, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే వీటిని తినడమే కాకుండా శివుడికి కూడా సమర్పిస్తారు. మరి ఈ పండును ఎందుకు సమర్పిస్తారు. దీనిని శివుడికి సమర్పించడం మంచిదేనా? అంటే?

చాలా వరకు ఎలాంటి ఎరువులు లేకుండా పెరిగే వాటిలో ఈ రేగు పండు చెట్టు మొదటి స్థానంలో ఉంటుంది. ఎరువులు, కెమికల్స్ వంటివి లేకుండానే చాలా సహజంగా పెరుగుతుంది ఈ మొక్క. అంతే కాకుండా ఈ పండ్లు కూడా మాగ పెట్టడం లాంటిది ఉండదు.. చెట్టుపైనే పక్వానికి వస్తాయి. గ్రామీణ ప్రాంతాలలో ఇవి ఎక్కువగా ఉంటాయి.

అయితే ఈ పండ్లను శివుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఎందుకు అంటే? పురాణాలలో వీటికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. శబరి రాముడికి రేగు పండ్లను తినిపిస్తుంది. అంతే కాకుండా శివుడికి కూడా ఈ పండ్లు చాలా ఇష్టం అంట. అందుకే చాలా మంది శివుడికి నైవేద్యంగా ఈ పండ్లను సమర్పిస్తుంటారు.

ఇక చాలా మందిలో ఒక డౌట్ ఉంటుంది. శివుడికి రేగు పండ్లు సమర్పించడం నిజంగా ఇది శుభప్రదమా? అని అయితే.. దీని గురించి పండితులు మాట్లాడుతూ..శివుడికి రేగుపండ్లు సమర్పిస్తే చాలా మంచిది అని చెబుతున్నారు. శివుడికి రేగు పండ్లు సమర్పించే ఆచారం కూడా ఉంది. తనకు ప్రీతికరమైన పండ్లలో ఇది కూడా ఒక్కటి.

అందుకే చాలా ప్రాంతాలలో రేగు పండ్లను శివుడికి సమర్పించే సంప్రదాయం కూడా ఉంది. శివుడికి రేగు పండ్లు సమర్పించడం వలన జీవితంలోని సమస్యల నుంచి త్వరగా బయటపడతారంట. నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.