
పౌర్ణమి రోజు సానుకూల శక్తి ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ సమయంలో ప్రతి ఒక్కరూ, దైవరాధాన చేస్తూ, ఇష్టదైవాన్ని ప్రార్థించడం వలన సకల శుభాలు కలుగుతాయి. అయితే ఈ రోజు ప్రతి కూల పనులు చేయడం పాపంతో సమానం అంట. ముఖ్యంగా ఈ రోజు కొన్ని రకాల పనులు చేయడం వలన మీ ఇంట దరిద్రం తాండవం చేస్తుందని చెబుతున్నారు జ్యోతిష్యశాస్త్రం నిపుణులు. కాగా పౌర్ణమి రోజు ఎలాంటి పనులు చేయకూడదో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

ఆర్థిక లావాదేవీలు : పౌర్ణమి రోజు ఇతరులకు డబ్బు ఇవ్వడం లేదా తీసుకోవడం చేయకూడదంట. ఈ రోజు ఆర్థిక లావాదేవీలు జరపడం అస్సలే మంచిది కాదు అని చెబుతున్నారు పండితులు. ముఖ్యంగా పౌర్ణమి ఆదివారం రోజున వచ్చినప్పుడు అస్సలే మనీ ఎవరికీ ఇవ్వకూడదంట. ఇస్తే లక్ష్మీదేవి మీ నుంచి వెళ్లిపోతుంది. ఒక వేళ మీరు డబ్బు తీసుకున్నా అది మీకు నష్టాన్నే మిగిలిస్తుందంట. అందువలన పౌర్ణమి రోజు డబ్బును అప్పుగా ఇవ్వడం అశుభం అని చెబుతున్నారు పండితులు.

జుట్టు, గోర్లు కత్తిరించడం : అమావాస్య రోజు మాత్రమే కాదు, పౌర్ణమి రోజున కూడా జుట్టు, గోర్లు కత్తిరించడం అశుభం అని చెబుతున్నారు పండితులు. దీని వలన ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ అవుతాయి. అలాగే ప్రతికూల శక్తులు అటాక్ చేసే ప్రమాదం ఉన్నదంట, ముఖ్యంగా ఆది వారం పౌర్ణమి వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో జుట్టు, గోర్లు కత్తిరించకూడదంట.

మాంసాహారం : అలాగే పవిత్రమైన పౌర్ణమి రోజున మాంసాహారం తీసుకోవడం అస్సలే చేయకూడదంట. దీని వలన దేవతల ఆశీస్సులు లభించవు. ప్రతికూలత పెరుగుతుంది. ఇది మీ ఇంటిలో అనేక సమస్యలకు కారణం అవుతుందని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు.

వాగ్వివాదాలు : ఈ పౌర్ణమి రోజున ఇతరులతో గొడవ పెట్టుకోవడం, కుటుంబంలో కలతలు తీసుకురావడం చేయకూడదంట. కోపంతో మాట్లాడటం కూడా అస్సలే మంచిది కాదు అని చెబుతున్నారు పండితులు. నోట్ : పై సమాచారం కేవలం పండితులు, నిపుణుల సలహా మేరకు మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదని పాఠకులు గమనించాలి.