
అయితే ప్రస్తుతం గురుడు సింహ రాశిలో సంచారం చేస్తున్నాడు. సింహ రాశిలో సంచారం వలన నాలుగు రాశుల జాతకంలో గురుడు అనుకూల స్థానంలో ఉండనున్నాడు. దీని వలన దాదాపు రెండు నెలలకు పైగా గురు గ్రహం ప్రభావంతో నాలుగు రాశుల వారికి ప్రతి పనిలో విజయం కలగనుంది. ధన లాభం కలుగుతుంది. ఇంతకీ అది ఏ రాశులు అంటే?

కుంభ రాశి : కుంభ రాశి వారికి గురు బలంతో ప్రతి పనిలో విజయం వరిస్తుంది. అనుకున్న పనులు సమయానికి పూర్తి చేసుకుంటారు. సంఘంలో వీరికి అంటూ ప్రత్యేమైన గుర్తింపు లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం లభిస్తుంది. చాలా రోజుల నుంచి ఎవరు అయితే మంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో, వారికి మంచి జాబ్ దొరికే ఛాన్స్ ఉంది.

మేష రాశి : మేష రాశి వారికి పట్టింది బంగారమే కానుంది. ఇంటా బయట సానుకూల వాతావరణం కలుగుతుంది. ఆదాయం పెరుగుతుంది. ప్రతి పనిలో విజయం వీరిదే అవుతుంది. వ్యాపారస్తులు ఎక్కువ లాభాలను అందుకుంటారు. విద్యార్థులకు కూడా ఇది మంచి సమయంగా చెప్పాలి.

ధనస్సు రాశి : ధనస్సు రాశి వారికి పట్టింది బంగారమే కానుంది. విద్యార్థులకు ఇది మంచి సమయం. కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. చాలా రోజుల నుంచి ఎవరు అయితే పెద్ద కాలేజీలో సీటు సంపాదించాలి అనుకుంటున్నారో వారి కోరిక నెరవేరుతుంది. అన్ని విధాలుగా వీరికి కలిసి వస్తుంది.

సింహ రాశి : సింహ రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకుంటుంది. సమాజంలో వీరికి ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా వస్తాయి. చాలా రోజుల నుంచి ఎవరు అయితే విదేశీ పర్యాటన చేయాలి అనుకుంటున్నారో, వారికి ఇది కలిసి వచ్చే సమయంగా చెప్పాలి.