కలలో కాకి కనిపించడం శుభమా? అశుభమా!

Updated on: Jun 03, 2026 | 4:34 PM

కలలు రావడం సహజం. ప్రతి ఒక్కరూ కలలు కంటారు. ముఖ్యంగా జ్యోతిష్య శాస్త్రంలో స్వప్న శాస్త్రానికి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. కాగా, ఇప్పుడు మనం స్వప్న శాస్త్రం ప్రకారం కలలో కాకి కనిపించడం శుభమా? అశుభమా ? అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

1 / 5
చాలా మంది కాకి అంటే చాలు అశుభంగా పరిగణిస్తారు. కాకి ఎదురు రావడం, ఇంటి ముందు వాలి అరవడం ఇవన్నీ కూడా అశుభ సంకేతాలు అంటారు. అంతే కాకుండా కాకి కొన్ని శుభ సంకేతాలు కూడా ఇస్తుంది. కానీ చాలా వరకు ఇది చావు, మరణ వార్తలు తీసుకొస్తుందని ఎక్కువగా నమ్ముతారు.

2 / 5
అందుకే చాలా మంది కాకిని చూస్తే భయపడతారు. ఇక కొన్ని సార్లు కలలో కాకి చూస్తారు. దీంతో కలలోకి వచ్చింది, ఇది దేనికి సంకేతం, అశుభమా? శుభమా తెలియక చాలా ఇబ్బంది పడుతుంటారు. అయితే కాకి కలలో కనిపించడం శుభ ప్రదమే అంటున్నారు పండితులు. కానీ మీరు అది కలలో ఎలా కనిపించిందో దాని బట్టి శుభ, అశుభ ఫలితాలు కలుగుతాయంట.

3 / 5
కాకికి యముడితో సంబంధం కలిగి ఉంటుందని నమ్ముతారు. అందుకే చాలా మంది కాకిని అశుభంగా భావిస్తారు. అయితే మీరు కలలో గనుక, కాకిని ఎగురుతున్నట్లు చూసినట్లు అయితే అది అస్సలే మంచిది కాదంట, ఇది మీకు మానసిక సమస్యలను తీసుస్తుంది. ముఖ్యంగా ఆర్థిక సమస్యలు, మానసిక సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉంది, ఇతరులతో గొడవలు జరిగే ఆస్కారం ఉందని చెబుతున్నారు పండితులు.

4 / 5
ఇక కలలో కాకి తలపై కూర్చొన్నట్లు కల వస్తే మాత్రం ఇది అస్సలే మంచిది కాదంట, ఇది చాలా అశుభకరమైన కల,  కలలో కాకి తలపై కూర్చోవడం మరణానికి సంకేతం. ఇది మీకు హాని జరగబోతుంది అనే సూచను ఇస్తుందంట. అందువలన కాకి తలపై కూర్చొన్నట్లు కల వస్తే అశుభంగా భావించాలి.

5 / 5
అయితే ఎవరి కలలో అయితే కాకి సహజంగా కూర్చొని కనిపిస్తుందో వారు శుభ వార్తలు వింటారు. చనిపోయిన కాకిని కలలో చూడటం అంటే మీ కష్టాలు అన్నీ తీరిపోయి మీరు చాలా సంతోషంగా ఉంటారని అర్థం. కాకుల గుంపు చూడటం కూడా మంచిది. కాకి అరుస్తున్నట్లు కలలో కనిపించడం ఇంటికి చుట్టాలు రావడం అని అర్థం. నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

Loading...
Unable to load recommendations.
Follow Us