
కార్డిఫ్ విశ్వవిద్యాలయం 2018 పరిశోధన ప్రకారం, భయానకమైన దృశ్యాలను చూపినప్పుడు కూడా సైకోపాత్‌ల కళ్లు పెద్దవి కావంట. అంతే కాకుండా వారు చాలా లైట్ తీసుకున్నట్లు కనిపిస్తారు. అయితే దీనికి కారణం వారి మెదడులోని అమిగ్దాలా ఇతరుల కంటే 18 శాతం తక్కువగా ఉండటమే కారణం అంట.

అలాగే అమెరికన్ సైకాలజికల్ అసోసియేషన్ ప్రకారం, సైకోపాథిక్ ప్రవర్తన కలిగిన వారు ఎక్కువసేపు కళ్లలోకి కళ్లు పెట్టి చూసి మాట్లాడలేరంట. వారు ఇతరులతో ఎక్కువసేపు మాట్లాడలేరు. అంతే కాకుండా ఎదుటి వారి కళ్లలోకి కళ్లు పెట్టి ఎక్కువ సేపు చూడలేరు. అంతే కాకుండా ఇతరుల భావాలను గౌరవించడంలో కూడా వారు వెనకబడిపోతారు.

భావోద్వేగాలకు, భావాలకు విలువ ఇవ్వరు, అంతే కాకుండా ఇలాంటి వ్యక్తులు ఎక్కువగా అబద్ధాలు చెబుతుంటారు. కారణం లేకుండా పదే పదే అబద్ధాలు చెబుతుంటారు. నమ్మిన వారినే మోసం చేస్తారు. పశ్చా్త్తాపం పడటం వంటివి ఉండవు. కొన్ని సార్లు ఇతరుల పట్ల క్రూరంగా ప్రవర్తిస్తారు.

ఇక వీరిలో ఉండే మంచి లక్షణం ఏమిటి అంటే? సైకోపాత్‌లు చాలా ఆకర్షణీయంగా ఉంటారు, ఎప్పుడూ చాలా అందంగా రెడీ అయి కనిపిస్తారు. అయితే వారు తమ నిజస్వరూపాన్ని దాచడంలో చాలా నేర్పులు. వారు తమ అసలై వ్యక్తిత్వం దాచడం కోసం ఆకర్షణీయంగా కనిపిస్తూ చాలా స్వీట్ గా మాట్లాడుతారు. కానీ వారు అనుకున్నది జరిగిన తర్వాత వారి అసలు క్యారెక్టర్ బయటకు తీస్తారు.

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు