
హిందూ మతంలో ఆంజనేయ స్వామిని భయాలను తెలిగించే దైవంగా కొలుస్తారు. ప్రతి ఒక్కరూ మంగళవారం, శని వారం ఆంజనేయ స్వామిని పూజిస్తూ, ప్రత్యేక పూజలు చేస్తారు. అయితే మీరు గమనిస్తే చాలా మంది తమ ఇంటిపై హనుమాన్ జెండాను ఎగరవేస్తుంటారు. అయితే కొంత మంది సంప్రదాయ పరంగా, సహజంగానే ఎగరవేశారు అనుకుంటారు. కానీ దీని వెనుక శక్తివంతమైన వాస్తు, ఆధ్యాత్మికత దాగుందని చెబుతున్నారు పండితులు.

ఎవరి ఇంటిపై అయితే హనుమాన్ జెండా ఉంటుందో వారి ఇంటిలో సానుకూల శక్తి పెరుగుతుంది. అంతే కాకుండా ప్రతికూల శక్తుల ప్రభావం తగ్గుతుందంట. హనుమాన్ జెండా ఉండటం వలన ఇది దుష్టశక్తులు దరిచేరకుండా చేస్తుందంట. ఇంటిలో ఉన్నవారికి మానసిక ప్రశాంతతను అందిస్తుందంట. అందుకే చాలా మంది తమ ఇంటిపై హనుమాన్ జెండాను పెడుతుంటారని చెబుతున్నారు నిపుణులు.

ఇంటిపై హనుమాన్ జెండాను పెట్టడం వలన , ఎక్కడైతే హనుమాన్ జెండా రెపరెపలాడుతూ ఉంటుందో, అక్కడ దుష్ట శక్తులు ఉండవు, అలాగే నరదిష్టి ఉండదు, ప్రతికూల శక్తుల ప్రభావం పూర్తిగా తగ్గిపోతుందంట. ఇది కుటుంబంలో శాంతిని నింపుతుంది. అంతే కాకుండా ఇంటిపై హనుమాన్ జెండా పెట్టడం వలన ఇది ఆర్థికపరమైన ఆటంకాలను తెలిగించి, కొత్త అవకాశాలు వచ్చేలా చేస్తుందంట.

అయితే ఇంటి పై హనుమాన్ జెండా పెట్టడం మంచిదే, కానీ దీనిని సరైన దిశలో పెట్టినప్పుడు మాత్రమే మంచి ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు నిపుణులు. లేకపోతే అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందంట. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిపై హనుమాన్ జెండాను నైరుతి మూలలో పెట్టాలి. ఇది రక్షణకు స్థిరత్వానికి మారు పరు.

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు